తాను ఓ అబ్బాయిని ప్రేమించింది.. కానీ ఆ అబ్బాయి మరో యువతిని ప్రేమించాడు. తాను ఎంత ప్రయత్నించినా ప్రేమించిన అబ్బాయి దక్కలేదు. దీంతో మనస్థాపానికి గురైన యువతి హాస్టల్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కృష్ణా జిల్లాలోని నూజివీడులో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే ఈదల గ్రామానికి చెందిన మందారాజు కుమార్తె  శైలు(19) నూజివీడులోని బీఫార్మసీ కాలేజీలో రెండో సంవత్సరం చదువుతోంది. కాగా.. శైలు అదే కాలేజీకి చెందిన ఓ యువకుడిని ప్రేమించినట్లు సమాచారం. అతను ఆమె ప్రేమను అంగీకరించలేదని తెలుస్తోంది. ఈ క్రమంలో గురువారం ఉదయం ఆరోగ్యం సరిగాలేదని కాలేజీ నుంచి హాస్టల్ కి వచ్చిన యువతి.. తన గదిలోని ఫ్యాన్ కి చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

Also Read టీడీపీ ఆఫీసులో బాలుడిపై అత్యాచారం.. మండిపడుతున్న వైసీపీ నేతలు...

గమనించిన హాస్టల్ వార్డెన్ వెంటనే శైలుని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా... అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. కాగా శైలు హాస్టల్ రూమ్ లో ఓ సూసైడ్ నోట్ దొరికినట్లు పోలీసులు చెబుతున్నారు. ఆ నోట్ ని బట్టి యువతి ప్రేమలో ఫెయిల్ అయ్యిందని అందుకే ప్రాణాలు వదిలినట్లు తెలుస్తోందని పోలీసులు చెబుతున్నారు.

కాగా శైలు రాసిన సూసైడ్‌నోట్‌లో ‘‘శివ, కీర్తి హ్యాపీగా ఉండండి, మిమ్మల్ని డిస్ట్రబ్‌ చేస్తున్నందుకు సారీ.. అయినా ఇలా చేస్తున్నందుకు బాగానే హ్యాపీగా ఫీల్‌ అవ్వండి..’’ అంటూ పేర్కొనడం గమనార్హం. కాగా శైలు రాసిన సూసైడ్‌నోట్‌ను స్వాధీన పరుచుకున్న నూజివీడు పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇదొక్కటే కారణమా.. లేక యువతి ఆత్మహత్యకు మరేదైనా కారణమం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.