టీడీపీ ఆఫీసులో ఓ బాలుడిపై అత్యాచారానికి పాల్పడ్డారని కర్నూలు జిల్లా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కర్నూలు జిల్లాలోని అవుకు మండల కేంద్రంలో గురువారం ఓ మైనర్ బాలుడిపై నలుగురు యువకులు అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలసిందే. వాటిని వీడియోలు కూడా తీశారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. కాగా.. ఈ ఘటనపై వైసీసీ ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి స్పందించారు.

టీడీపీ కార్యాలయంలో ఇలాంటి ఘటనలు జరగడం దారుణమన్నారు. బాలుడిని డిన్నర్‌ పేరుతో పిలిచి నలుగురు యువకులు సామూహిక అత్యాచారం జరపడం వారి క్రూరత్వానికి నిదర్శనమన్నారు. నిందితుల తల్లిదండ్రులు కూడా వారు చేసిన పనిని క్షమించరని చెప్పారు. 

Also Read కర్నూల్‌లో దారుణం: మైనర్ బాలుడిపై నలుగురి లైంగిక దాడి, అస్వస్థత...

అనంతరం బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి మాట్లాడుతూ బాలుడిపై కిరాతకంగా అత్యాచారానికి పాల్పడిన టీడీపీ కార్యకర్తలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గతంలో కూడా నిందితులు పలువురిపై వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయని చెప్పారు.అప్పట్లో నిందితులపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ.. టీడీపీ నేతలు వెనకేసుకొచ్చారని చెప్పారు. తప్పుచేసిన వారిపై కేసులు పెట్టకుండా పోలీసులను అడ్డుకున్నారని విమర్శించారు.

కాగా, అవుకులోని నలుగురు యువకులు 14 ఏళ్ల బాలుడిపై సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు.  అయితే బాలుడికి రక్తస్రావమై అస్వస్థతకు గురికావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాలుడిని చిత్రహింసలు పెట్టిన నలుగురు నిందితులు బుల్లెట్‌ రాజు, ప్రేమ్‌ కుమార్‌, రాజుతో పాటు మరొకరని గుర్తించారు. వీరిపై సెక్షన్‌ 377 కింద ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. కాగా.. నిందితులు నలుగురు టీడీపీ కార్యకర్తలంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.