విశాఖపట్నం: ప్రభుత్వ సంక్షేమ పథకాలకు రుణాలు మంజూరు చేయడంలేదంటూ కృష్ణాజిల్లాలో ఓ బ్యాంకు ముందు మున్సిపల్ సిబ్బంది చెత్త వేసిన విషయం తెలిసిందే. ఈ చర్యలతో వైసిపి ప్రభుత్వం తీవ్ర విమర్శలను ఎదుర్కుంటోంది. రుణాలు ఇవ్వకపోతే బ్యాంకుల ముందు చెత్త వేయిస్తారా? ప్రభుత్వమే ఇంత దారుణంగా వ్యవహరిస్తే ఎలా అంటూ ప్రతిపక్ష టిడిపితో పాటు ఇతర పార్టీల నాయకులు, సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కూడా ఈ విషయంపై స్పందిస్తూ సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

''బ్యాంకులను బెదిరించడానికి చెత్త పోసి జగన్ రెడ్డిది చెత్త పాలన అని మరోసారి నిరూపించుకున్నారు. జగన్ రెడ్డి సైకో మనస్తత్వానికి, బెదిరింపులకి ఏపీకి 200 కంపెనీలు గుడ్ బై చెప్పాయి. ఇప్పుడు చెత్త చర్యలతో బ్యాంకులు కూడా బై,బై చెప్పడం ఖాయం. దేశ చరిత్రలో చెత్త పోసి బ్యాంకులను భయపెట్టిన వేస్ట్ గాడిగా జగన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారు సాయిరెడ్డి'' అంటూ అయ్యన్న జగన్ ను తీవ్రస్థాయిలో విమర్శించారు.

read more  చెల్లిని కాపాడలేని వాడు అన్నఎలా అవుతాడు?: జగన్ పై బుద్దా ఫైర్

''ఏటేటి విజయసాయి రెడ్డి... జగ్గడు కరోనా కి మందు కనిపెట్టేసినాడా? ఆ మందు నువ్వు డిసెంబర్ 25న కోటి మందికి పంచేస్తున్నావా? కొంపతీసి బ్లీచింగ్ బిల్లలుగా చేయించుకొని మింగావా?మతిపోయి మాట్లాడుతున్నావు. 6నెలల క్రితం చెప్పిన మూడు మాస్కులే ఇవ్వలేని జగ్గడు కరోనా వ్యాక్సిన్ తయారుచేసా అంటే నువ్వు ఎలా నమ్మావు వీసా'' అంటూ ఇదివరకే విజయసాయి రెడ్డికి కూడా స్ట్రాంగ్ కౌంటరిచ్చారు అయ్యన్నపాత్రుడు. 

''పేరాసిట్మాల్, బ్లీచింగ్, వైకాపా ఏలూరు స్పెషల్ వాటర్ కలిపి మిక్సీ కొట్టి జగన్ రెడ్డి తయారు చేసిన కరోనా మందు తమకు కూడా ఇవ్వాలని ప్రపంచ దేశాల అధినేతలు, ఫార్ములా మాకు కూడా ఇవ్వాలంటూ ప్రముఖ కంపెనీలు క్యూ కడుతున్నాయా సాయి రెడ్డి? రాష్ట్ర ప్రజలకు కనీసం మాస్క్ ఇవ్వలేక చేతులెత్తేసిన వాడు వ్యాక్సిన్ ఇస్తాడని పగటి కలలు కంటున్నావా?నీ బుర్రకి తట్టే తప్పుడు లెక్కలు రాసుకోక ట్విట్టర్ పాట్లు ఎందుకు సాయిరెడ్డి'' అంటూ వెంకన్న కూడా కౌంటరిచ్చారు.