విజయవాడ: అనంతపురం జిల్లాలో ఎస్‌బిఐ ఉద్యోగి స్నేహలత దారుణ హత్యపై స్పందిస్తూ సీఎం జగన్ పై, వైసిపి ప్రభుత్వంపై టిడిపి అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విరుచుకుపడ్డారు. మహిళల రక్షణ కోసం సీఎం జగన్ బుల్లెట్ వేగంతో కదులుతారన్న వైసిపి నాయకులు మాటలను గుర్తుచేస్తూ సోషల్ మీడియా వేదికన సీఎంపై తీవ్ర విమర్శలు చేశారు వెంకన్న. 

''చెల్లమ్మలని కాపాడలేని వాడు అన్న ఎలా అవుతాడు?బుల్లెట్ కంటే వేగంగా వస్తాడన్న జగన్ రెడ్డి రాడే?దిశ చట్టం ఓ అబద్ధం, రోజుకో మహిళ బలైపోవడం నిజం. ఇంకెంత మంది మహిళలు బలైతే తాడేపల్లి కోటలో మొద్దునిద్ర పోతున్న జగన్ రెడ్డి నిద్రలేస్తారు?'' అంటూ బుద్దా వెంకన్న ట్విట్టర్ వేదికన మండిపడ్డారు. 
 
''మహిళల ఉసురు జగన్ రెడ్డికి ఖచ్చితంగా తగులుతుంది. మధ్య నిషేధం అంటూ గద్దెనెక్కిన మీరు నకిలీ సారా పోసి ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్నారు. మహిళల పేరుతో జగన్ రెడ్డి లిక్కర్ మాఫియా 25 వేల కోట్ల స్కామ్ చేస్తుంది'' అని ఆరోపించారు.

''మహిళల పుస్తెలు సైతం వదలకుండా లాగేస్తున్న జగన్ రెడ్డి, సాయి రెడ్డి పాపం పండే రోజు దగ్గర్లోనే ఉంది.ఒక్కో మహిళా కనకదుర్గగా మారి మీ పాపాలకి శిక్ష వెయ్యడం ఖాయం రెడీగా ఉండు సాయిరెడ్డి. జగన్ రెడ్డి ఫ్యాన్ గిర్రున తిప్పుతూనే ఉన్నాడు కాకపోతే పాపం రెక్కలే రివర్స్ లో తిరుగుతున్నాయి సాయిరెడ్డి'' అంటూ వెంకన్న మండిపడ్డారు.