అమరావతి: వైసిసి ఎంపీ విజయసాయి రెడ్డి పుట్టినరోజునే జగన్ ప్రభుత్వం కొత్త 108, 104 అంబులెన్స్ లను ప్రారంభించడంపై మాజీ మంత్రి,టిడిపి నేత అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఈ అంబులెన్స్ ల వ్యవహారంలో విజయసాయి రెడ్డి భారీ అవినీతికి పాల్పడినట్లు ప్రతిపక్ష టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు. అలాంటిది ఆయన పుట్టినరోజునే వీటిని ప్రారంభించడంతో టిడిపి నాయకులు మరింతగా విమర్శలు ఎక్కుపెడుతున్నారు. 

''300 కోట్ల ప్రజాధనంతో ఘనంగా సాయి రెడ్డి గారి జన్మదినం. ఏ2  గారి జన్మదినోత్సవం సందర్బంగా 300 కోట్ల స్కామ్ 108 ని ఏ1 జగన్ రెడ్డి గారు గిఫ్ట్ గా ఇచ్చారు. అప్రూవర్ గా మారకుండా ఉండటానికి ఆ మాత్రం సమర్పించుకోకపోతే ఎలా!'' అంటూ ట్విట్టర్ వేదికన అయ్యన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. 

read more  విజయసాయి టార్గెట్ గా వ్యాఖ్యలు: వెనక్కి తగ్గని రఘురామకృష్ణమ రాజు

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 108 అంబులెన్స్ ల నిర్వహణలో రూ. 307 కోట్ల కుంభకోణం జరిగిందని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ కుంభకోణంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రధాన సూత్రధారి అని టీడీపీ అధికార ప్రతినిది కొమ్మారెడ్డి పట్టాభిరాం ఆరోపించారు.  అంబులెన్సుల నిర్వహణలో ఏ విధంగా అవినీతి జరిగిందో ఆయన వివరించారు. సాక్ష్యాధారాలతో తాము చెప్తున్నామని, వీటిపై సీఎం స్పందించాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

''2016కి ముందు వరకూ జీవీకే ఈఎంఆర్‌ సంస్థ అంబులెన్సులను నిర్వహించేది. 2011 అక్టోబరు 1 నుంచి 2016 సెప్టెంబరు 30 వరకూ ఆ సంస్థకే నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తూ ఉమ్మడి రాష్ట్రంలోనే ఒప్పందం జరిగింది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆ ఒప్పందం విషయంలో ఏ మాత్రమూ జోక్యం చేసుకోకుండా జీవీకే నిర్వహణకు అన్ని విధాలుగా సహకరించాం'' అని పట్టాభి తెలిపారు. 

''2016లో ఓపెన్‌ టెండర్లు పిలవడం ద్వారా మహారాష్ట్ర, ఢిల్లీ వంటి రాష్ట్రాలతోపాటు లండన్‌కు చెందిన యూకే ఎస్‌ఏఎస్‌ భాగస్వామ్యం కలిగిన బీవీజీ కంపెనీ టెండర్లు దక్కించుకుందన్నారు.. నియమ నిబంధనలకు అనుగుణంగా 2017 డిసెంబరు 13న ఐదేళ్ల కాల పరిమితితో కాంట్రాక్టు పొందిందని ఆయన గుర్తుచేశారు.
ఈ కాంట్రాక్టు 2020 డిసెంబరు 12 వరకూ ఉంటుంది. అయితే.. మధ్యలో జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం రావడంతోనే 2019 సెప్టెంబరు 5న ఉన్న అంబులెన్సులకు అదనంగా మొత్తంగా 439 అంబులెన్సులు కొనుగోలు చేసేందుకు 105 జీవో ఇచ్చింది'' అని ఆయన చెప్పారు. 

''రాష్ట్ర ప్రభుత్వంపై భారం లేకుండా ఉండేందుకు ఫైనాన్స్‌ ద్వారా కొనుగోలు చేయనున్నట్లు అందులో పేర్కొంది. అంతేకాదు 2019 సెప్టెంబరు 20న పాత, కొత్త అంబులెన్సుల నిర్వహణకు సంబంధించి కొత్త ఏజెన్సీని గుర్తించాలని 111 జీవో విడుదల చేసింది. బీవీకే సంస్థ కాంట్రాక్టు పరిమితి ముగియక ముందే కొత్త సంస్థను గుర్తించాల్సిన అవసరం ఏమిటో ముఖ్యమంత్రి, ఆరోగ్యశాఖ మంత్రి సమాధానం చెప్పాలి'' అని పట్టాభిరాం డిమాండ్‌ చేశారు.

బీవీజీ సంస్థ ఒక్కో అంబులెన్సుకు రూ.1.31 లక్షలకే నిర్వహిస్తుంటే ఆ సంస్థను కాదని అరబిందో ఫౌండేషన్‌ సంస్థకు ఎందుకు ఇవ్వా ల్సి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. జగన్మోహన్‌రెడ్డి ఆత్మ అయిన విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్‌కు చెందిన అరబిందో ఫౌండేషన్‌కు ఉన్నపళంగా కాంట్రాక్టులు కట్టబెట్టడం ద్వారా 108 అంబులెన్సుల నిర్వహణలోనే రూ.307 కోట్ల కుంభకోణం జరిగిందని పట్టాభిరాం ఆరోపించారు.