విశాఖపట్నం: ఇటీవల ఓ నేషనల్ ఛానల్ నిర్వహించిన సర్వేలో భారతదేశం లో నెంబర్ వన్ స్థానంలో ఉండవలసిన ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  3వ స్థానంలో ఉన్నారన్న స్టేట్మెంట్ చూసి చాలా మనస్తాపానికి గురయ్యానంటూ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఎద్దేవా చేశారు. ఎప్పుడూ రాష్ట్రంలో అన్నింటా జగన్మోహన్ రెడ్డి A-1, విజయసాయి రెడ్డి A-2 గా వుంటారని... ఇప్పుడెందుకు ఇలా జరిగిందో అర్థం కావడం లేదంటూ సెటైర్లు విసిరారు. 

''మన ముఖ్యమంత్రి అన్ని రంగాల్లోనూ ముందున్నారు. అలాంటిది మూడవ స్థానాన్ని ఇవ్వడం నేను ఖండిస్తున్నాను. ఆయనకు నెంబర్ వన్ స్థానంలో ఉండవలసిన అర్హతలన్ని ఉన్నాయి'' అంటూ  సంచలన కామెంట్స్ చేశారు. 

వీడియో

"

''నెంబర్ వన్ స్థానంలో ఉండడానికి జగన్ కి వున్న అర్హతలివే. 

1.అవినీతి చేయడంలో నెంబర్ వన్.

2.కరోనా వ్యాప్తి చెయ్యడంలో నెంబర్ వన్.

3.భూ కుంభకోణం చెయ్యడంలో నెంబర్ వన్.

4.ఇసుక కుంభకోణం లో నెంబర్ వన్.

5.ప్రజల్ని మోసం చేయడంలో నెంబర్వన్

6.మహిళలపై దారుణాలు జరగడంలో మన రాష్ట్రం నెంబర్ వన్

7.దళితులపై దాడులు, దౌర్జన్యాల జరగడం లో నెంబర్ వన్'' అని తెలిపారు. 

''ఇలా ఇన్ని అర్హతలతో  మన రాష్ట్రం నెంబర్ వన్ లో ఉంటే ఇండియన్ సర్వే వాళ్ళు మాత్రం మూడవ స్థానం ఇవ్వడం చాలా బాధాకరమైన విషయం. అంటే ఎక్కడో తప్పు జరిగింది. ఇండియా టుడే సర్వే చేయడం లో ఏమైనా తప్పు జరిగిందా లేదా ప్రింటింగ్ లో ఏమైనా తప్పు జరిగిందా. విజయసాయి రెడ్డి గారు మీరైనా కాస్త జాగ్రత్త వహించి సరి చేయించాల్సిందిగా కోరుతున్నాను'' అంటూ అయ్యన్న ముఖ్యమంత్రి జగన్ ను ఎద్దేవా చేశారు.