Asianet News TeluguAsianet News Telugu

స్నాప్‌డీల్‌తో  యాక్సిస్ డీల్

  • ఫ్రీఛార్జ్‌ను రూ.385 కోట్లకు యాక్సిస్‌ బ్యాంకు కోనుగోలు
  • వ్యూహాత్మక భాగస్వామ్యంలో బాగమేనన్న యాక్సిస్ బ్యాంక్ 
axis bank own to freecharge

 
స్నాప్‌డీల్‌కు చెందిన డిజిటల్‌ చెల్లింపుల విభాగమైన  ఫ్రీఛార్జ్‌ను  రూ.385 కోట్లకు యాక్సిస్‌ బ్యాంకు కోనుగోలు చేసింది. ఫ్రీఛార్జ్‌ వాటాను కొనుగోలు చేసేందుకు స్నాప్‌డీల్‌ మాతృ సంస్థ  జాస్పర్‌ ఇన్ఫోటెక్‌తో యాక్సిస్‌ బ్యాంకు ఒప్పందం జరిగింది. తీవ్ర నష్టాల్లో ఉన్న స్నాప్‌డీల్‌ ను ప్లిప్‌కార్ట్‌ ను కొనడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఈ డీల్ వ్యపార వర్గాల్లో చర్చనీయంగా మారింది. 
జాస్పర్‌ ఇన్ఫోటెక్‌ చేతిలో ఉన్న ఫ్రీఛార్జ్‌ పేమెంట్‌  సంస్థ వాటాను కొనుగోలు చేసేందుకు యాక్సిస్‌లిస్ట్‌ సొల్యూషన్స్‌ ప్రతిపాదనకు రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా ఆమోదాన్ని కోరింది. 100 శాతం వాటాను స్వాదీనం చేసుకోడానికి డీల్ జరిగింది. ఒప్పందం విలువ రూ.385 కోట్లుగా నిర్ణయించినట్లు రిజర్వ్ బ్యాంక్ కు సమర్పించిన ఫైలింగ్‌ లో యాక్సిస్‌ బ్యాంకు తెలిపింది. 
 ఈ అగ్రిమెంట్‌పై సంతకం చేసినట్లు యాక్సిస్‌ బ్యాంకు డైరెక్టర్‌, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ శిఖా శర్మ తెలిపారు. భవిష్యత్ ను దృష్టిలో పెట్టకుని ఈ ఒప్పందాన్ని జరిపినట్లు ఆమె తెలిపారు. ప్రస్తుతం ఫ్రీఛార్జ్‌ ఆదాయం రూ.80కోట్లుగా ఉన్నప్పటికి వ్యూహాత్మక భాగస్వామ్యంలో బాగంగానే పెద్ద మొత్తంలో డబ్బులను వెచ్చించినట్లు ఛీప్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ జైరామ్‌ శ్రీధరన్‌ తెలిపారు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios