Asianet News TeluguAsianet News Telugu

భారీ ఉద్యోగాల భర్తీ...: కోవిడ్19పై సమీక్షా సమావేశంలో మంత్రి అవంతి

విశాఖపట్నం సితమ్మధారలోని క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కోవిడ్19 పై సమీక్షా సమావేశం నిర్వహించారు.

avanti srinivas conduct review meeting on covid19
Author
Visakhapatnam, First Published Aug 5, 2020, 8:04 PM IST

విశాఖపట్నం సితమ్మధారలోని క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కోవిడ్19 పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ గోవిందరావు, డిఎంహెచ్ఓ తిరుపతిరావు, కేజీహెచ్ ప్రిన్సిపాల్ డాక్టర్ సుధాకర్ పలువురు పాల్గొన్నారు. 

ఆగస్ట్ 3వ తేదీన విమ్స్ ఆస్పత్రిని మంత్రి పరిశీలించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అక్కడ కరోన బాధితులకు కల్పిస్తున్న వసతులపై ఆరా తీశారు.  విమ్స్‌ సిబ్బంది కరోనా సోకిన మహిళను పట్టించుకోలేదన్న ఆరోపణలపై మంత్రి స్పందిస్తూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. 

ఈ సమావేశంలో ఆసుపత్రులలో తీసుకుంటున్న చర్యలు, సిబ్బంది పలు అంశాలపై చర్చించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. విమ్స్ కోవిడ్  హాస్పిటల్లో ప్రస్తుతం ఉన్న సిబ్బండితో పాటు అదనంగా సిబ్బందిని నియమిస్తున్నట్లు తెలియచేసారు. దీనిలో భాగంగా స్టాఫ్ నర్స్ 213 మందిని ఒప్పందం పద్దతిలో... డేటా ఎంట్రీ ఆపరేటర్స్, పారామెడికల్, సిబ్బందితో పాటు ఇతర సిబ్బందితో కలిపి దాదాపుగా 370మందిని నియమిస్తున్నట్లు తెలిపారు. అలాగే కొత్తగా 55 వైద్యులను నియమించనున్నారని తెలిపారు. 

read more   ఆ ఆసుపత్రుల్లో ప్లాస్మా థెరపీ...మొట్టమొదటి దాత వైసిపి ఎమ్మెల్యేనే

ఆస్పత్రిలో సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండి సేవా దృక్పథంతో విధులు నిర్వహించాలన్నారు. ఆసుపత్రిలో వార్డులతో పాటు చుట్టుప్రక్కల అవరణలన్ని పరిశుభ్రంగా ఉంచాలని...24 గంటలపాటు సానిటైజ్ చేసుకుంటు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. కోవిడ్ బాధితుల నుంచి వారి అభిప్రాయాలను వీడియో కాన్ఫెరెన్సు ద్వారా తీసుకొని మరింతగా సేవలు అందించాలన్నారు.

కొన్ని సందర్భాల్లో రోగుల ఆరోగ్య పరిస్థితిపై సమాచారం తెలియడంలేదని వారి బంధువులు ఆందోళనకు గురవుతున్నారని... దీన్ని నివారించడానికి రోగి వివరాలతో పాటు వారి బంధువుల ఫోన్ నెంబర్ లను తీసుకోవాలన్నారు.  కోవిడ్ భాధితుల సమాచారాన్ని వారి కుటుంబ సభ్యులకు అందించాలన్నారు. ఆసుపత్రులలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడటమే కాకుండా పదిహేను రోజులకు ఒక్కసారి పరిశీలించి బాధితులతో మాట్లాడుతామని చెప్పారు.ఆసుపత్రిలో  వసతులు అన్ని ఉన్నాయన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios