Asianet News TeluguAsianet News Telugu

ఆ ఆసుపత్రుల్లో ప్లాస్మా థెరపీ...మొట్టమొదటి దాత వైసిపి ఎమ్మెల్యేనే

కోవిడ్-19 మరణాల సంఖ్యను తగ్గించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని గుంటూరు జిల్లా కలెక్టర్ ఐ.శామ్యూల్ ఆనంద్ అన్నారు.

plasma theraphy started at guntur
Author
Amaravathi, First Published Aug 5, 2020, 1:13 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

గుంటూరు: కోవిడ్-19 మరణాల సంఖ్యను తగ్గించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని గుంటూరు జిల్లా కలెక్టర్ ఐ.శామ్యూల్ ఆనంద్ అన్నారు. గుంటూరు రెడ్ క్రాస్ సొసైటీ ఏర్పాటు చేసిన ప్లాస్మా డోనార్ సెల్ ని జిల్లా కలెక్టర్ బుధవారం ప్రారంభించగా ఇటీవలే కోవిడ్ నుండి కోలుకున్న పొన్నూరు శాసనసభ్యులు కిలారి రోశయ్య మొట్టమొదటగా ప్లాస్మా దానం చేశారు.

ఈ సందర్భంగా భాగంగా కలెక్టర్ మాట్లాడుతూ... కోవిడ్ నుండి పూర్తిగా కోలుకున్న 18 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ లోపు పురుషులు ప్లాస్మా ఇచ్చేందుకు అర్హులని, ఆసక్తి ఉన్న వారు ప్లాస్మా దానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రితో పాటూ ఎన్నారై ఆసుపత్రిలో ప్లాస్మా  థెరపీని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.

పొన్నూరు శాసనసభ్యులు కిలారి రోశయ్య మాట్లాడుతూ... కోవిడ్ బాధితులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని, కోవిడ్ మహమ్మారి నియంత్రణ కోసం ప్రభుత్వం అనేక వ్యవస్థల ద్వారా కృషిచేస్తుందని చెప్పారు. ఓ నెగిటివ్ గ్రూప్ ప్లాస్మాని తాను మొదటగా దానం చేయడం సంతోషంగా ఉందని అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios