అఖిలకు షాకిచ్చిన ఏవి

First Published 1, Jan 2018, 5:01 PM IST
Av subbareddy jolts minister akhila priya over dinner politics
Highlights
  • కర్నూలు జిల్లాలో సమీకరణలు మారిపోతున్నాయి.

కర్నూలు జిల్లాలో సమీకరణలు మారిపోతున్నాయి. సమీకరణలు కూడా ఏ స్ధాయిలో మారిపోతున్నాయంటే వచ్చే ఎన్నకల్లో ఎవరూ ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేనంత. ఇదంతా ఎందుకంటే, డిసెంబర్ 31 రాత్రి జరిగిన విందు రాజకీయం జిల్లాలో పెద్ద ప్రకంపనలనే సృష్టిస్తోంది. దివంగత ఎంఎల్ఏ భూమా నాగిరెడ్డికి ప్రధాన అనుచరుడంటే అందరూ ముందుగా చెప్పుకునేది ఏవి సుబ్బారెడ్డినే. అటువంటి ఏవికి మంత్రి భూమా అఖిలప్రియకు మధ్య పచ్చగడ్డ వేయకపోయినా మండుతోంది. విచిత్రమేమిటంటే, తండ్రి నాగిరెడ్డి సన్నిహితుడైన ఏవి, కూతురు అఖిలకు బద్ద శతృవుగా మారటం.

ఇటువంటి నేపధ్యంలో ఏవి ఆదివారం రాత్రి ఆళ్ళగడ్డలో భారీ విందు ఏర్పాటు చేసారు. ఎప్పుడైతే ఏవి వింధు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసిందే మంత్రి కూడా అలర్టయ్యారు. ఏవి ఎవరెవరిని వింధుకు పిలిచారో వారిలో అత్యధికులతో మంత్రి మాట్లాడారట. వింధును గ్రాండ్ సక్సెస్ చేయాలని ఏవి ప్రయత్నిస్తుంటే, ఫ్లాప్ చేయాలని మంత్రి వ్యూహం పన్నారు. ఎందుకంటే, ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది లేండి. ఈ పోరాటం వచ్చే ఎన్నికల్లో ఇటు నంద్యాల అటు ఆళ్ళగడ్డపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

వచ్చే ఎన్నికల్లో ఏవి కూడా టిక్కెట్టును ఆశిస్తున్నారట. అందుకనే ఇప్పటి నుండి ప్రాబల్యం పెంచుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందులో భాగమే డిసెంబర్ 31 వింధు. సరే, ఈ విషయాన్ని పసిగట్టిన అఖిల వింధును ఫ్లాప్ చేయాలని చాలా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎవరి ప్రయత్నాల్లో వారుండగానే డిసెంబర్ 31 రావటం, రాత్రి వింధు జరగటం అన్నీ అయిపోయాయి. దాంతో మంత్రికి పెద్ద షాక్ తగిలినట్లైంది. ఎందుకంటే, వింధుకు గ్రామస్ధాయి నుండి నియోజకవర్గాల స్ధాయిలో పట్టున్న నేతలంతా హాజరయ్యారు.

వింధులో నంద్యాల, ఆళ్ళగడ్డ, మహానంధి, బండి ఆత్మకూరు ప్రాంతాల నుండి వందలాది మంది పాల్గొన్నారు. అంతకన్న మించిన షాక్ ఏమిటంటే వింధులో అఖిలప్రాయ దగ్గర బంధువులు కూడా చాలా మందే పాల్గొన్నారట. దాంతో మంత్రికి ఒళ్ళు మండిపోతోంది. వింధుకు హాజరవ్వద్దని మంత్రి చెప్పిన మాటలను కూడా పక్కనపెట్టి మరీ హాజరయ్యారు. దాంతో ఏం చేయాలో మంత్రికి అర్ధం కాక  వింధులో జరిగిన విషయాలపై ఆరా తీసే పనిలో మంత్రి బిజీగా ఉన్నారట.

loader