చిన్నపిల్లనా, అందుకే నా కూతురితో చెప్పించా: అఖిలప్రియపై ఏవీ సుబ్బారెడ్డి

AV Subba Reddy says he will abide by leadership
Highlights

మంత్రి భూమా అఖిలప్రియ చిన్నపిల్లనా,  తన తాహతుకు తగదని అనుకుని తన కూతురితో సమాధానం ఇప్పించానని తెలుగుదేశం పార్టీ నేత ఎవీ సుబ్బారెడ్డి అన్నారు. 

అమరావతి: మంత్రి భూమా అఖిలప్రియ చిన్నపిల్లనా,  తన తాహతుకు తగదని అనుకుని తన కూతురితో సమాధానం ఇప్పించానని తెలుగుదేశం పార్టీ నేత ఎవీ సుబ్బారెడ్డి అన్నారు. అఖిలప్రియకు, ఏవి సుబ్బారెడ్డికి మధ్య విభేదాలు మరింత ముదురుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.

ఏవీ సుబ్బా రెడ్డిపై రాళ్ల దాడి నేపథ్యంలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. దీంతో పరిష్కారానికి తన వద్దకు రావాల్సిందిగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వారిద్దరిని ఆదేశించారు. ఏవీ సుబ్బారెడ్డి అమరావతికి చేరుకోగా అఖిలప్రియ మాత్రం కర్నూలులోని ఉండిపోయారు. 

తనకు సమాచారం లేదని, అందుకే ఈ రోజు రాలేదని, రేపు (గురువారం) వస్తానని ఆమె చెప్పినట్లు సమాచారం. అమరావతికి చేరుకుని చంద్రబాబు నాయుడిని కలుసుకోవడానికి సిద్ధపడిన ఏవి సుబ్బారెడ్డి అఖిలప్రియపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. 

దాదాపు 30 ఏళ్లు కష్టపడి పనిచేసిన తనపై రాళ్ల దాడి చేయిస్తారా అని ఏవి సుబ్బారెడ్డి ప్రశ్నించారు. అధిష్టానం, ప్రజానీకం తప్పెవరిదనే విషయాన్ని తేలుస్తాయని అన్నారు. అధిష్టానం నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని చెప్పారు. 

తనపై రాళ్ల దాడి చేయించింది అఖిలప్రియనే అని, ఆమె అనుచరులే తనపై దాడి చేశారని, అందుకు వందశాతం రుజువులు ఉన్నాయని, తప్పించుకునే అవకాశమే లేదని ఆయన చెప్పారు. అధిష్టానం మీద గౌరవం ఉందని, సర్దుకుని పోవాలని అన్నారు. అధిష్టానం ఏది చెప్తే అది వింటానని అన్నారు. 

వాళ్లు చిన్నపిల్లలా, ఏవి సుబ్బారెడ్డి అంటే భయమూ భక్తీ ఉండేవని, తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని, ఇదంతా చెత్త అని ఆయన అన్నారు. 

loader