మాజీ మంత్రి భూమా అఖిలప్రియపై ఏవీ సుబ్బారెడ్డి కూతురు జస్వంతి రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 

మాజీ మంత్రి భూమా అఖిలప్రియపై ఏవీ సుబ్బారెడ్డి కూతురు జస్వంతి రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నంద్యాల జిల్లాలో మంగళవారం రాత్రి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా ఏవీ సుబ్బారెడ్డి, అఖిలప్రియ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఫేస్‌బుక్ లైవ్ ద్వారా స్పందించిన జస్వంతి రెడ్డి.. అఖిలప్రియను దున్నపోతు, బజారు మనిషి అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. తాము పార్టీ సిద్దాంతాలను నమ్ముకుని పనిచేస్తున్నామని.. అందుకే ఈ ఘటన గురించి ఇప్పటివరకు ఎలాంటి ప్రెస్ మీట్ పెట్టలేదని చెప్పారు. లోకే ష్ పాదయాత్ర డిస్టర్బ్ అవుతుందనే తాము మాట్లాడలేదని తెలిపారు. 

తండ్రి లాంటి వ్యక్తి మీద అఖిలప్రియ అసత్య ఆరోపణలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అఖిలప్రియ హత్యయత్నం చేశారని అంటుందని.. ఆమె కొంచెం అన్న బుద్ది ఉండి మాట్లాడుతుందా అని ప్రశ్నించారు. అఖిలప్రియ చేసే ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు ఉండవని అన్నారు. యువగళం పాదయాత్ర లైవ్‌ వీడియోను గనక చూస్తే.. అసలు అక్కడ ఏం జరిగిందో తెలుస్తుందని అన్నారు. అఖిలప్రియ ఆరోపిస్తున్నట్టుగా అక్కడ ఏం జరగలేదన్నారు. నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాలలో ఎక్కడి నుంచి అయినా పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నామని చెప్పారు. అఖిలప్రియకు టికెట్ ఇస్తే మాత్రం ఒడించి తీరుతామని తెలిపారు. 

Also Read: నంద్యాల ఘటనపై చంద్రబాబు సీరియస్.. త్రిసభ్య కమిటీ ఏర్పాటు.. వాటిపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచన..

తెలుగుదేశం పార్టీ ఇవన్నీ పరిశీలించాలని కోరారు. లో క్లాస్ మైండ్ సెట్ ఉన్న అఖిలప్రియను ప్రజలు, పార్టీ ఎంకరేజ్ చేయవద్దని అన్నారు. అఖిలప్రియ పాదయాత్ర చేసినప్పుడు ఆమె చేతిలో పిల్లాడు లేడని.. ప్రెస్ మీట్‌ అప్పుడు పిల్లాడు లేడని.. పోలీసులు అరెస్ట్ చేసేటప్పుడు మాత్రం పిల్లాడు వస్తాడని విమర్శించారు. సింపతి కోసమే అఖిలప్రియ చూస్తుందని.. ఉమెన్ కార్డు వాడుకుని ఇష్టానుసారం ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. అఖిలప్రియ బరితెగించి తిరుగుతుందని తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. నీచమైన బతుకు బుతుకుందని విమర్శించారు. 

‘‘నిన్న జరిగిన తోపులాటలో నాన్న చొక్కా చిరిగింది. ఆయనకు పెద్దగా గాయాలు కాలేదు. భూమా నాగిరెడ్డి చాలా మీటింగ్‌లలో ఆయన, ఏవీ సుబ్బారెడ్డి వేరే కాదని చెప్పారు. చిన్నప్పటి నుంచి అఖిలను పెంచి, ఎత్తుకున్న వ్యక్తిని.. తండ్రి స్థాయిలో ఉన్న వ్యక్తిపై ఆమె దాడి చేయించింది. 100 రోజుల నుంచి ప్రశాంతంగా జరుగుతున్న యువగళం యాత్రలో ఇలాంటి అటాక్ చేసింది. కొంచమైన ఆ బజారు మనిషి, దున్నపోతు అఖిలప్రియకు బుద్ది ఉంటే.. ఎలాంటి టైమ్‌లో ఏం చేయాలనే సెన్స్ ఉంటే.. అలాంటి చర్యలకు పాల్పడదు. మాపై ఇది ఫస్ట్ టైమ్ జరిగిన అటాక్ కాదు. ఇప్పటికీ మా మీద రెండు అటాక్స్ జరిగాయి. టీడీపీ చేపట్టిన సైకిల్ యాత్ర సందర్భంగా మాపై అటాక్ జరిగింది. తర్వాత హైదరాబాద్‌లోని మా ఇంట్లో ఉంటే.. రెక్కి నిర్వహించి.. మా నాన్నను చంపాలని మనుషులను మాట్లాడింది. చిన్నప్పటి నుంచి చూసిన మనిషి అని.. నాన్న గానీ, మేము గానీ పార్టీని నమ్ముకుని, పోలీసులను నమ్ముకుని చట్టపరమైన అడుగులే వేశాం. కానీ నిన్న జరిగిన అటాక్‌ను మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాను. అఖిలప్రియ చేసినదానికి తగిన ఫలితం అనుభవించక తప్పదు’’ అని జస్వంతి రెడ్డి పేర్కొన్నారు.