బాలికపై ఆటో డ్రైవర్ లైంగిక దాడి.. 15 యేళ్లు జైలు, రూ.50 జరిమానా...
తన ఆటోలో కాలేజీకి వెళ్లే బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడో యువకుడు. అతడికి కోర్టు 15 యేళ్ల జైలుశిక్ష విధించించింది. రూ.50వేల జరిమానా కూడా వేసింది.
విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో ఓ వ్యక్తికి ఫోక్సో చట్టం కింద 15 ఏళ్ల జైలు శిక్ష పడింది. దీంతో పాటు 50వేల జరిమానా కూడా విధించారు. బాలికపై లైంగిక దాడి చేసిన కేసులో ఆటో డ్రైవర్ కు ఈ మేరకు శిక్ష విధిస్తూ గురువారం నాడు తీర్పు వెలువడింది. విశాఖలోని ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి జీ ఆనందిని ఈ మేరకు గురువారంనాడు తీర్పు వెలువరించారు. జరిమానా చెల్లించలేని పక్షంలో అదనంగా మరో ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించారని తీర్పు ఇచ్చారు.
బాధిత బాలికకు ఫోక్సో చట్టం కింద రాష్ట్ర ప్రభుత్వం పరిహారంగా నాలుగు లక్షల రూపాయలు ఇవ్వాలని న్యాయమూర్తి తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ కరణం కృష్ణ ఈ మేరకు తెలిపారు… విశాఖపట్నంలోని అక్కయ్యపాలెం రాంజీ ఎస్టేట్ కు చెందిన పదహారేళ్ల బాలిక 2016లో నగరంలోని రామా టాకీస్ దగ్గర ఉన్న ప్రైవేటు కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరింది.
రైతులకు ఆప్కాబ్ ద్వారా మరిన్ని సేవలు: ఆప్కాబ్ వజ్రోత్సవ వేడుకల్లో సీఎం జగన్
ఆమె ప్రతిరోజు ఇంకొంతమంది అమ్మాయిలతో కలిసి ఓ ఆటోలో కాలేజీకి వెళుతుండేది. ఆ ఆటోను సాయి గణేష్(25) అనే యువకుడు నడుపుతుండేవాడు. 2016 సెప్టెంబర్ 29న బాధిత బాలికను సాయి గణేష్ రామా టాకీస్ దగ్గర నుంచి పోర్ట్ స్టేడియం మీదుగా అక్కయ్యపాలెం పైపుల సందులోకి తీసుకెళ్లాడు. అక్కడ ఎవరూ లేని ప్రదేశంలో బాలిక మీద లైంగిక దాడికి పాల్పడ్డాడు.
ఈ క్రమంలో తీవ్రంగా రక్తస్రావమైన బాలికను తిరిగి తీసుకువచ్చి వారి ఇంటి దగ్గర వదిలిపెట్టాడు. ఆ తర్వాత ఆ బాలిక ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి డ్రైవర్ తన మీద అత్యాచారానికి పాల్పడ్డాడని తెలియజేసింది. ఆమెకు తీవ్ర రక్తస్రావం అవుతుండడంతో మొదట సెవెన్ హిల్స్ ఆసుపత్రికి, ఆ తర్వాత కేజీహెచ్ కు తరలించారు.
బాధిత బాలిక ఫిర్యాదు మేరకు విశాఖ నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దీనిమీద సమగ్ర దర్యాప్తు చేశారు. ఆ తర్వాత కోర్టులో చార్జిషీర్ దాఖలు చేశారు. నిందితుడు చేసిన నేరం రుజువు కావడంతో పోక్సో ప్రత్యేక కోర్టు అతడికి 15 ఏళ్ల జైలు శిక్ష, రూ. 50 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.