నెల్లూరు జిల్లాలో బాలుడి కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపింది. ఎనిమిదేళ్ల అచ్యుత్ అనే బాలుడిని బైక్‌పై వచ్చిన దుండగులు అపహరించేందుకు ప్రయత్నం చేశారు. అయితే వీరిని గమనించిన స్థానికులు.. దుండగుల్ని అడ్డుకున్నారు.

ఈ క్రమంలో బండి కిందకు పడిపోవడంతో దుండగుల్లో ఒకడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు స్థానికులు. మరొకరు పారిపోయాడు. నగరంలోని మాగుంట లేఔట్ కేకేఆర్ గౌతమ్ స్కూల్‌ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.