లైంగిక వేధింపులు: ప్రోఫెసర్‌పై విద్యార్ధిని కుటుంబసభ్యుల దాడి

లైంగిక వేధింపులు: ప్రోఫెసర్‌పై  విద్యార్ధిని కుటుంబసభ్యుల దాడి


నెల్లూరు: నెల్లూరు మెడికల్ కాలేజీలో విద్యార్ధినిపై  ప్రోఫెసర్ లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ  విద్యార్ధిని  బంధువులు ప్రోఫెసర్‌పై దాడికి పాల్పడ్డారు.   
గురువారం నాడు  నెల్లూరు మెడికల్ కాలేజీలో  ప్రోఫెసర్‌ మెడిసిన్ ఫైనలియర్ విద్యార్ధినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని బాధితురాలు తమ కుటుంబసభ్యులకు చెప్పింది. దీంతో బాధితురాలి కుటుంబసభ్యులు  ప్రోఫెసర్ పై కాలేజీలోనే దాడికి పాల్పడ్డారు.

ఈ విషయాన్ని గుర్తించిన  కాలేజీ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు.  కాలేజీ సిబ్బంది యువతి బంధువులకు నచ్చజెప్పారు. తనపై  ప్రోఫెసర్ వేధింపులకు పాల్పడ్డాడని  బాధితురాలు ఆరోపించింది.


ఈ విషయమై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరో వైపు తనపై బాధితురాలు చేసిన ఆరోపణలను  ప్రోఫెసర్ ఖండించాడు. హజరుశాతం విషయమై తాను ఖచ్చితంగా వ్యవహరించడంతో తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన చెప్పారు. ఈ విషయమై పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 
 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Andhra Pradesh

Next page