గణేష్ నిమజ్జనానికి తమ కంటే ముందే వెళ్లారని దళితులపై దాడి.. శ్రీసత్యసాయి జిల్లాలో ఘటన
గణేష్ నిమజ్జనానికి ముందుగా వెళ్లారనే కారణంతో పలువురు దళితులపై దాడి జరిగింది. ఈ ఘటన ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లాలో చోటు చేసుకుంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ జరుపుతున్నారు.

గణేష్ నిమజ్జనానికి ముందుగా వెళ్లారని దళితులపై పలువురు దాడి చేశారు. ఈ ఘటన ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లాలో జరిగింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు, ‘ఈనాడు’ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. సోమందేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని చాకర్లపల్లిలో దళితులు వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. బుధవారం నిమజ్జనం చేయాలని నిర్ణయించుకొని, విగ్రహాన్ని వాహనంలో తరలించారు.
రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, ఆర్ఐ.. ఎక్కడంటే ?
అయితే వీరి వాహనాన్ని ఇతర సామాజికవర్గానికి చెందిన పలువురు యువకులు అడ్డుకొని దుర్భాషలాడారు. దీంతో బాధితులు ఈ విషయంలో అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే స్థానిక ఎస్ఐ తిరుమల బ్రహ్మోత్సవాల బందోబస్తుకు వెళ్లారు. మళ్లీ శుక్రవారం రాత్రి పలు సామాజిక వర్గాలకు చెందిన యువకులు, మహిళలు శుక్రవారం రాత్రి దళిత కాలనీల్లో కర్రలు పట్టుకొని తిరిగారు. కులం పేరుతో దూషణలు చేశారు. ఈ సమయంలో వారు పలువురిపై దాడి చేశారు.
విచారణకు చంద్రబాబు సహకరించలేదు: సీఐడీ తరపు న్యాయవాది వివేకానంద
దీంతో సీఐ, ఎస్ఐలు శనివారం ఆ గ్రామానికి చేరుకొని విచారణ జరిపారు. మొత్తంగా 18 మందిపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇందులో పలువురు అధికార వైసీపీ నాయకులు కూడా ఉన్నారు. కాగా.. గ్రామంలో పికెట్ ఏర్పాటు చేశామని పోలీసులు వెల్లడించారు.