ఏటిఎంల్లో నగదు ఉపసంహరణ రూ. 10 వేలకు పెంచారు
ఖాతాదారులకు శుభవార్త. ఏటిఎంల నుండి నగదు తీసుకోవాలనుకునే వారికి ఇక నుండి రూ. 10 వేలు ఇవ్వాలని రిజర్వ్ బ్యాంకు నిర్ణయించింది. ఈ మేరకు బ్యాంకులకు ఆదేశాలు కూడా జారీచేసింది. అంటే నగదు ఉపసంహరణ పరిమితిని ఇప్పటి వరకు ఉన్న రూ. 4500 నుండి రూ 10 వేలకు పెంచారన్నమాట. అయితే, సేవింగ్స్ ఖాతా నుండి వారానికి తీసుకునే రూ. 24 వేల లిమిట్ లో ఎటువంటి మార్పులు చేయలేదు.
అదే విధంగా కరెంట్ ఖాతానుండి కూడా వారానికి లక్ష రూపాయల వరకు ఉపసంహరించునేందుకు ఆర్బిఐ అనుమతించింది. అంతా బాగానే ఉంది కానీ ఏటిఎంల్లో నగదు ఉండొద్దు ? ఏటిఎంలు పనిచేయద్దుూ? అంటే ఎవరూ ఏమి చెప్పలేరు. అంతా మోడి దయ...మన ప్రాప్తం.
