ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోడి కత్తి కమల్‌హాసన్ అని రుజువైందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఎన్నికల్లో లబ్దిపొందేందుకే ఆనాడూ కోడి కత్తి డ్రామా ఆడారని విమర్శించారు. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోడి కత్తి కమల్‌హాసన్ అని రుజువైందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఆనాడూ ఎన్నికల్లో లబ్దిపొందేందుకే కోడి కత్తి డ్రామా ఆడారని విమర్శించారు. అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీపైకి నెపం నెట్టి లబ్ది పొందారని అన్నారు. పీకే ఇచ్చిన కోడి కత్తి స్క్రిప్ట్‌ను జగన్ అమలు చేశారని ఆరోపించారు. కోడి కత్తి అనేది పెద్ద డ్రామా అని తాము ముందు నుంచి చెబుతునే ఉన్నామని అన్నారు. రాష్ట్ర పోలీసుల మీద నమ్మకం లేదని.. ఈ కేసును ఎన్‌ఐఏకు ఇవ్వాలని జగన్ కోరారని.. జగన్ కోరిక మేరకే ఎన్‌ఐఏ దర్యాప్తు చేసి అఫిడవిట్ దాఖలు చేసిందని అన్నారు. 

ఎన్‌ఐఏ అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిందని అన్నారు. ఈ ఘటనతో టీడీపీకి సంబంధం లేదని చెప్పారు. అధికారంలోకి వచ్చేందుకు చేసిన డ్రామా ఈరోజు బద్దలైందని విమర్శించారు. సీఎం జగన్ డ్రామాలను ప్రజలు తెలుసుకోవాలని కోరారు. ఇప్పుడు ఎన్‌ఐఏ మీద కూడా నమ్మకం లేదంటారా? అని ప్రశ్నించారు. సిగ్గులేకుండా మరేదైనా సంస్థతో దర్యాప్తు కావాలని అడుగుతారా? అంటూ మండిపడ్డారు. కుట్రలు, హత్యలు, దారుణాలు చేసిన జగన్ రాజకీయాల నుంచి అనర్హుడిగా ప్రకటించాలని అన్నారు. 


Also Read: కోడి కత్తి ఘటనలో కుట్ర కోణం లేదు.. కోర్టులో కౌంటర్ దాఖలు చేసిన ఎన్‌ఐఏ..