టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు నాయకులపై పోలీస్ కేసులు పెట్టడంపై అచ్చెన్నాయుడు ఘాటుగా స్పందించారు.
అమరావతి :పుంగనూరులో చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితులపై పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. టిడిపి చీఫ్ చంద్రబాబుతో పాటు మరికొందరు టిడిపి నాయకులపై అన్నమయ్య జిల్లా ముదివీడు పీఎస్ లో కేసు నమోదయ్యింది.ఏ1గా చంద్రాబాబు. ఏ2గా దేవినేని ఉమ ను, ఏ3గా అమర్నాథ్ లను చేర్చారు. ఇలా తమ పార్టీ అధినేతతో పాటు నాయకులపై కేసులు నమోదు చేయడంతో ఏపీ టిడిపి అధ్యక్షుడు కింజరాపు అచ్చన్నాయుడు ఘాటుగా స్పందించారు.
ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పోలీసులను అడ్డుపెట్టుకుని చంద్రబాబు, టిడిపి నాయకులపై తప్పుడు కేసులు పెట్టాడని అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఇలాంటి కేసులతో టిడిపి ని అడ్డుకోలేవని గుర్తిస్తే మంచిదని అన్నారు. ఇప్పుడు జరుగుతున్న ప్రతీ చర్యకూ రేపు ప్రతిచర్య ఉంటుందని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. నేడు టిడిపి కార్యకర్త చిందిస్తున్న ప్రతి రక్తపు బొట్టుకూ రేపు సమాధానం చెప్తామని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.
చంద్రబాబు పర్యటన సందర్భంగా పుంగనూరు, అంగళ్లులో అలజడ సృష్టించిది వైసిపి మూకలేనని... ఈ దాడులకు ఉసిగొల్పింది జగన్ రెడ్డే అని అచ్చెన్న ఆరోపించారు. తిరిగి చంద్రబాబుపైనే కేసు నమోదు చేయడం జగన్ రెడ్డి పిరికితనానికి నిదర్శనమని అచ్చెన్న అన్నారు.
Read More పుంగనూరు అల్లర్లలో చంద్రబాబుపై ఎఫ్ఐఆర్ నమోదు
రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై చంద్రబాబు యుద్ధభేరి మోగించడంతో జగన్ రెడ్డి వెన్నులో వణుకు పుట్టిందని అచ్చెన్న అన్నారు. చంద్రబాబు ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే ఇలా దాడులు, తప్పుడు కేసులు పెడుతున్నారని అన్నారు. చంద్రబాబు రోడ్ షోలకు వస్తున్న జనాధరణ చూసి జగన్ ఫ్రస్ట్రేషన్ కు గురవుతున్నాడని అన్నారు. జగన్ రెడ్డి పిల్లచేష్టలు నవ్వు తెప్పిస్తున్నాయని అచ్చెన్న ఎద్దేవా చేసారు.
తెలుగుదేశం పార్టీ పర్యటన రూట్‌లో వైసీపీ కార్యకర్తలకు ఏం పని? వైసీపీ ర్యాలీలు,ధర్నాలకు అధికారులు ఎలా అనుమతిస్తున్నారు? అని అచ్చెన్న ప్రశ్నించారు. దాడులు చేసిన వారిని వదిలేసి బాధితులపై కేసులు పెట్టడం జగ్లక్ రెడ్డికే చెల్లిందంటూ అచ్చెన్నాయుడు మండిపడ్డారు.
