పనీబాట లేని కొడాలి నానిని మంత్రిని చేసి రాష్ట్ర ప్రజలపైకి ఆంబోతులా విడిచిపెట్టింది జగన్ రెడ్డేనని టిడిపి ఏపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు మండిపడ్డారు.
విజయవాడ: బూతుల మంత్రి కొడాలి నాని వాగుడు రోగం చివరి దశకు చేరిందని...అందువల్లే ఇష్టానుసారంగా ఎవరినిపడితే వాళ్లను దుర్బాషలాడుతున్నాడని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఈ బూతుల మంత్రిని జగన్ రెడ్డి ఊరి మీద ఆంబోతులా వదిలేశారని విమర్శించారు. ఇవాళ(మంగళవారం) మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును పోలీసులు ఆధీనంలోకి తీసుకోవడాన్ని అచ్చెన్న ఖండించారు.
''పనీబాట లేని కొడాలి నానిని ఊరిమీద ఆంబోతులా రాష్ట్ర ప్రజలపై విడిచిపెట్టారు. ఆయనకు తిట్ల మీద ఉన్న పట్టు తన శాఖపై లేదు. శాంతియుతంగా ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్ష చేస్తానన్న ఉమామహేశ్వరరావును పోలీసులు ఎందుకు ఆధీనంలోకి తీసుకున్నారు? అనుచిత వ్యాఖ్యలు చేసిన నానిని తక్షణమే అరెస్టు చేయాలి'' అని డిమాండ్ చేశారు.
''నిరసన తెలిపే హక్కు ప్రతిపక్షాలకు లేదా? చేతనైతే చర్చకు రావాలి తప్ప కిరాయి మూకలతో అల్లర్లు సృష్టించడం ఏంటి? రాష్ట్రంలో ఎన్నో సమస్యలు తిస్టవేశాయి. వాటిని పరిష్కరించడం చేతకావడం లేదు. ప్రజలు తంతారనే భయంతో రోజుకో వివాదాన్ని తెరపైకి తెస్తున్నారు. ఇష్టమొచ్చినట్లు మొరుగుతామంటే చూస్తూ ఊరుకోం'' అని హెచ్చరించారు.
video ఒక్కడివే రా... ఎవరి షేపులు ఎవడు మారుస్తాడో చూస్కుందా: దేవినేనికి నాని సవాల్
''తాగింది దిగేవరకు ఎవరినో ఒకరిని నాని తిడతారు. రెచ్చగొట్టేలా మాట్లాడిన నానిపై పోలీసులు చర్యలు ఎందుకు తీసుకోలేదు? కుట్రలు, బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు. బడిత పూజ చేస్తానన్న నాని రాష్ట్ర ప్రజలకు ఏం సంకేతం ఇస్తున్నారు? అరాచకాలను తగ్గించుకుంటే బాగుంటుంది. అభివృద్ధి మీద చర్చకు రమ్మంటే వ్యక్తిగత విమర్శలు చేయడం సిగ్గుచేటు'' అన్నారు.
''జనం ముందుకు నాని వస్తే మొహం మీద కాండ్రించి ఉమ్మేస్తారు. గుడివాడ ప్రజల సమస్యలు పక్కన పెట్టి పక్క నియోజకవర్గాల్లో వేలు పెడుతున్నారు. బాబాయి హత్య కేసులో మోడీ కాళ్లు పట్టుకునేందుకు జగన్ డిల్లీ వెళ్లారు. ఈ విషయాన్ని పక్కదారి పట్టించేందుకు నానిని జగన్ రెడ్డి వదిలారు. వైసీపీ తీరు చూసి ప్రజలంతా చీదరించుకుంటున్నారు'' అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Jan 19, 2021, 1:19 PM IST