సోదరుడు, కేంద్ర మాజీమంత్రి యర్రన్నాయుడును తలచుకుని మంత్రి అచ్చెన్నాయుడు భోరుమన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని స్వగ్రామం కోటబొమ్మాళిలో గురువారం యర్రన్న వర్ధంతి జరిగింది. ఆ సందర్భంగా మంత్రితో పాటు యర్రన్నాయుడు కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. యర్రన్నాయుడు కొడుకు, శ్రీకాకుళం ఎంపి రమ్మోహన్ నాయుడు కుటుంబసభ్యులతో మంత్రి కుటుంబం కూడా యర్రన్నను తలచుకుని కంటతడిపెట్టారు.

అచ్చెన్న మాట్లాడుతూ, అనునిత్యం ప్రజలతో కలిసిపోయే నేతగా సోదరుడిని గుర్తు చేసుకున్నారు. జిల్లా అభివృద్ధికి యర్రన్నాయుడు విశేష కృషి చేసారని చెప్పారు. తన సోదరుడి ఆశయాలను నెరవేర్చటమే తమ ప్రధమ కర్తవ్యంగా మంత్రి తెలిపారు. ఎంపి రామ్మోహన్ మాట్లాడుతూ స్వపక్షాలే కాకుండా ప్రతిపక్ష నేతలతో కూడా తన తండ్రి ఎంతో అభిమానంగా ఉండేవారన్నారు.