చిత్తూరు: టమాట రైతులతో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సమావేశమయ్యేందుకు మార్కెట్ కమిటీ అధికారులు అనుమతి ఇచ్చారు. గురువారం నాడు ఉదయం 11:30 గంటలకు పవన్ కళ్యాణ్  టమాట రైతులతో సమావేశం కానున్నారు.

టమాట రైతులతో సమావేశం కావడానికి పవన్ కళ్యాణ్‌ మార్కెట్ కమిటీ అధికారులను కోరారు. కానీ, మార్కెట్ కమిటీ అధికారులు మాత్రం పవన్ కళ్యాణ్‌కు అనుమతి ఇవ్వలేదు. ఈ విషయమై పవన్ కళ్యాణ్ వైసీపీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Also read:మీ 151 మంది నా రెండు చిటికెలు, ఎవరు అడ్డం వస్తారో చూస్తా: వైసీపీపై పవన్ సంచలన వ్యాఖ్యలు

మదనపల్లెలో టమాట మార్కెట్‌ను తాను సందర్శించకుండా ఎవరు అడ్డుకొంటారో చూస్తానని పవన్ కళ్యాణ్  బుధవారం రాత్రి హెచ్చరించారు. అవసరమైతే రోడ్డుపైనే బైఠాయించి తన నిరసనను వ్యక్తం చేస్తానని ఆయన తేల్చి చెప్పారు.

ఢిల్లీ కేంద్రంగా పవన్ వ్యూహం: జగన్ పై పవర్ అటాక్, డైరెక్షన్ వారిదేనా....

మదనపల్లె మార్కెట్‌ను సందర్శించకుండా తనను అడ్డుకోవడంపై పవన్ కళ్యాణ్ సీరియస్ వ్యాఖ్యలు చేశారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో మదనపల్లె టమాట మార్కెట్‌ను సందర్శించేందుకు మార్కెట్ కమిటీ అధికారులు అనుమతిని ఇచ్చారు.

Also read:పవన్ కళ్యాణ్ కు షాక్: పర్యటనకు నో చెప్పిన మార్కెట్ కమిటీ

గురువారం నాడు ఉదయం పదకొండు గంటలకు మదనపల్లె మార్కెట్ యార్డును సందర్శించాలని పవన్ కళ్యాణ్ భావించారు. అయితే  మార్కెట్ కమిటీలో రద్దీ దృష్ట్యా అధికారులు పవన్ కళ్యాణ్ పర్యటనకు అనుమతిని నిరాకరించారు. పవన్ కళ్యాణ్ ఆగ్రహం తర్వాత  తిరిగి  ఆయన మార్కెట్ కమిటీ పరిశీలనకు అనుమతిని ఇచ్చింది.