అరకు: విశాఖపట్టణం జిల్లాలోని అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణకు కనోనా సోకింది. ఈ విషయాన్ని గురువారం నాడు వైద్యులు ఆయనకు తెలిపారు. ఫాల్గుణకు కరోనా సోకడంతో  కుటుంబసభ్యులు స్వీయ నిర్భంధంలోకి వెళ్లారు.

ఏపీలో ఇప్పటికే డిప్యూటీ సీఎం అంజద్ బాషాతో పాటు పలువురు ఎమ్మెల్యేలకు కరోనా సోకింది. విజయనగరం జిల్లా ఎస్.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసులు, గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, కర్నూలు జిల్లా శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, గుంటూరు జిల్లా తెనాలి ఎమ్మెల్యే శివకుమార్, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి  కరోనా బారినపడ్డారు. ఏపీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతికి కరోనా సోకింది.  కరోనా నుండి రోశయ్య కోలుకొన్నారు. శివకుమార్ క్వారంటైన్ కే పరిమితమయ్యారు. 

also read:కరోనాను జయించిన 105 ఏళ్ల కర్నూల్ వృద్ధురాలు

తాజాగా మరో ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణకు కూడ కరోనా సోకడంతో ఆయన చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు. కుటుంబసభ్యులు హోం క్వారంటైన్ కు పరిమితమయ్యారు.