Asianet News TeluguAsianet News Telugu

అరకు బస్సు ప్రమాదం : క్షతగాత్రులను పరామర్శించిన మంత్రులు.. (వీడియో)

విశాఖపట్నం కేజీహెచ్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న అరకు ప్రమాదం బాధితులను  రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ లు పరామర్శించారు. 

araku bus accident : ministers alla nani, avanthi srinivas in visaka kgh - bsb
Author
Hyderabad, First Published Feb 13, 2021, 12:59 PM IST

విశాఖపట్నం కేజీహెచ్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న అరకు ప్రమాదం బాధితులను  రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ లు పరామర్శించారు. 

అరకు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులకు అన్ని విధాలుగా వైద్యం అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి అదేశించారు. ఈ మేరకు మంత్రులు వారిని పరామర్శించారు. ప్రస్తుతం KGH లో 12మంది క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు.

హాస్పిటల్ వైద్యులు పర్యవేక్షణలో బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని, అరకులోయ ఘాట్లో బస్ ప్రమాదం అత్యంత బాధాకరమని మంత్రులు ఆళ్ల నాని, అవంతి శ్రీనివాస్ అన్నారు.  మృతులు కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి మృత దేహాలను వారి వారి బంధువులకు అప్పగించడానికి అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. బాధితుల కుటుంబాలకు సమాచారం అందించడం కోసం యాక్సిడెంట్ జరిగిన వెంటనే హెల్ప్ లైన్ ఏర్పాటు చేశామని తెలిపారు. 

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంది వైద్య సేవలు అందిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఈ ప్రమాదంలో గాయపడిన బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నామని మంత్రులు ఆళ్ల నాని, అవంతి శ్రీనివాస్ లు అన్నారు. 

ప్రమాదానికి గురైన టూరిస్ట్ బస్ లో మొత్తం 26మంది ప్రయాణం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో 4మృతి చెందారు. మిగిలిన బాధితులు ఎస్ కోట కమ్యూనిటీ హెల్త్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.

"

KGH లో చికిత్స పొందుతున్న 12మందిలో 4గురు పరిస్థితి కొంత విషమంగా ఉంది. వీరికి బలమైన గాయాలు కావడంతో ఈ నలుగురు పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉందని అయినా మెరుగైన వైద్యం అందించి అన్ని విధాలుగా రక్షించేలా చర్యలు చేపట్టామని మంత్రులు తెలిపారు. 

అరకులోయకు విహార యాత్రకు వెళ్లిన హైదరాబాదీల టూరిస్టు బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో 8 మంది మృత్యువాత పడ్డారు. ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. గాయపడినవారిని ఎస్ కోట ఆస్పత్రికి తరలించారు. 

ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 38 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. బస్సు 80 అడుగుల లోతు లోయలో పడింది. ప్రమాదానికి గురైన బస్సు షేక్ పేటకు చెందిన దినేష్ ట్రావెల్స్ కు చెందింది. ప్రమాద వివరాల కోసం హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. వివరాలకు 08912590102, 08912590100 నెంబర్లను సంప్రదించాలని తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios