అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రిని మించిన తనయుడు అని ప్రశంసించారు ఏపీఐఐసీ చైర్మన్, నగరి ఎమ్మెల్యే రోజా. రాష్ట్రంలో ప్రజలకు సుపరిపాలన అందించేది కేవలం వైయస్ కుటుంబానికి దక్కిందన్నారు. 

తన తండ్రి దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆశయ సాధన కోసం జగన్మోహన్ రెడ్డి ఎంతో పాటుపడ్డారని చెప్పుకొచ్చారు. వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన ఐదునెలల వ్యవధిలోనే దాదాపుగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేశారని చెప్పుకొచ్చారు. 

వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ప్రతీ ఒక్కరిని ఆదుకుంటున్నాయన్నారు. జగన్ పాలనపై దేశమంతా చర్చించుకుంటుందని తెలిపారు. తమిళనాడు ప్రజలు అయితే జగన్ పాలనపై ఒక చర్చ జరుగుతుందని తెలిపారు. 
 
వైయస్ జగన్ ను రాజకీయంగా ఎదుర్కొనలేక ఆనాటి తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు ఎన్నో కుట్రలు చేశాయని ఆరోపించారు. జైల్లో పెట్టించినా జగన్ లొంగకపోవడంతో ఆయనను అంతమెుందించేందుకు కూడా విపక్షాలు ప్రయత్నించాయని ఆరోపించారు. 

జగన్ పై కందిరీగలు దాడి చేసేలా టీడీపీ నేతలు  కుట్ర పన్నినా, ఎయిర్ పోర్ట్ లో హత్య చేసేందుకు సైతం ప్రయత్నించినా ఆయన వెనకడుగువేయలేదన్నారు. ఒక ముఖ్యమంత్రి తనయుడిగా గోల్డెన్ స్ఫూన్ తో పుట్టిన జగన్ ప్రజల కోసం, తండ్రి ఆశయ సాధన కోసం ఎన్నో కష్టాలు అనుభవించారన్నారు.  

జగన్ పై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేసిందని రోజా మండిపడ్డారు. జగన్ కు తలపొగరు అని, ఎవర్నీ పట్టించుకోరని, పెద్దలమాట గౌరవించరంటూ ఎంత తప్పుడు ప్రచారం చేసినా ప్రజా సంకల్పయాత్రలో జగన్ అంటే ఏంటో నిరూపించారన్నారు. 

జగన్ మనస్తత్వం, జగన్ వ్యక్తిత్వం గురించి తెలుసుకున్నారని దాంతో ఎల్లోమీడియా చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు గమనించారని తెలిపారు. ఎల్లో మీడియా చేసిన తప్పుడు ప్రచారంపై ఆగ్రహంగా ఉన్న ప్రజలు సార్వత్రిక ఎన్నికల్లో తమ తీర్పుతో గుణపాఠం చెప్పారన్నారు. 

జగన్ ప్రజలను అభిమానించే వ్యక్తి అని ప్రజా సంకల్పయాత్రలో తెలుసుకున్నారని తెలిపారు. అందువల్లే 151 సీట్లతో గెలుపొందారని తెలిపారు. చిన్నవయస్సులో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన సీఎం ఆయన చేస్తున్న సంక్షేమాన్ని చూసి సంతోషం కలుగుతుందన్నారు.  

ఈ వార్తలు కూడా చదవండి

భార్య బ్రాహ్మణి కోసమే లోకేష్ దీక్ష...ఇసుక ఖాతాలో...: రోజా

సీన్ లోకి రోజా : నవయుగకు కోలుకోలేని దెబ్బ కొట్టిన ఫైర్ బ్రాండ్