కర్నూలు: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాను హస్తం గుర్తుపైనే పోటీ చేస్తానని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. కర్నూలు జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన తన ఒంట్లో కాంగ్రెస్ రక్తం తప్ప మరొకటి లేదన్నారు. పొత్తులపై రాష్ట్రంలో భిన్నాభిప్రాయలు ఉన్నాయన్నారు. అయితే పొత్తుల అంశంపై రాహుల్ గాంధీ నిర్ణయమే ఫైనల్ అన్నారు. 

జనవరి3న ఢిల్లీలో జరగబోయే సీడబ్ల్యూసీ సమావేశంలో పొత్తులపై చర్చించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో పొత్తా లేక ఒంటరిగా పోటీ చేయాలా? అనే అంశం ఆ సమావేశంలో స్పష్టత వస్తుందన్నారు. ఏదేమైనా రాహుల్‌ నిర్ణయమే ఫైనల్‌ అనన్నారు. 

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ నెమ్మదిగా పుంజుకుంటోందన్నారు. బడుగు, బలహీన వర్గాలతో పాటు ఉద్యోగులు కూడా మోదీని ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని అభిప్రాయపడ్డారు.మోదీ ఓ యాక్సిడెంటల్‌ ప్రధాని మాత్రమేనన్నారు.