కృష్ణా జిల్లా బీసీ వెల్ఫేర్ హాస్టల్ లో జరిగిన  దారుణాలు ఖండిస్తున్నామన్నారు ఏపీ మహిళా కమీషన్ ఛైర్మన వాసిరెడ్డి పద్మ. విజయవాడలో గురువారం మీడియాతో మాట్లాడిన ఆమె... ఆడవారి పై అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని, మహిళా ఉద్యోగులకు అన్యాయం జరిగితే ఉపేక్షించబోమన్నారు.

డిపార్ట్‌మెంట్‌లో జెండర్ డీస్క్రిమినేషన్ ప్రస్తావన లేవనెత్తడం హేయమైన చర్యగా పద్మ అభివర్ణించారు. మహిళల పట్ల ప్రతిఒక్కరు గౌరవం కలిగి వుండాలని.. మహిళలపై జరుగుతున్న నేరాలు మహిళా కమీషన్ దృష్టికి వచ్చాయన్నారు.

రాష్ట్రంలోని అన్ని డిపార్ట్‌మెంట్‌లోని మహిళా ఉద్యోగులను వేధిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వాసిరెడ్డి పద్మ  స్పష్టం చేశారు. బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ లో వార్డెన్ సైతం కొంత మంది వేధిస్తున్నారని మా దృష్టికి వచ్చిందన్నారు.

ముఖ్యమంత్రి జగన్ మహిళలకు రక్షణ కల్పించాలని సంకల్పించారని ఆమె తెలిపారు. ఈ రోజు  ముప్పై మంది విమెన్ ఆఫీసర్లను  విచారించామని వాసిరెడ్డి పద్మ చెప్పారు.

మహిళ కమిషన్ కు ప్రతి రోజు ఫిర్యాదులు వస్తున్నాయని... మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం దిశ చట్టాన్ని తీసుకువచ్చిందని.. స్పెషల్ కోర్టులను ఏర్పాటు చేశామని పద్మ గుర్తుచేశారు.

కొత్త చట్టం ద్వారా నేరస్తులకు ఇరవై ఒక్క రోజులో శిక్ష పడే విధంగా చర్యలు చేపట్టామని ఆమె చెప్పారు. రాష్ట్రంలో మహిళ ఉద్యోగుల భద్రత కు జగన్ ప్రభుత్వం ఏళ్ల వేళలా సిద్దము గా ఉంటుందని వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు.