Asianet News TeluguAsianet News Telugu

AP Weather update: ఏపీలోని ప‌లు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు..

Amaravati: ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు, నెల్లూరు, తిరుపతి సహా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లో చిరుజ‌ల్లులు సైతం ప‌డ‌తాయ‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ (ఐఎండీ)  పేర్కొంది. 

AP Weather Update: Light to moderate rainfall at many places in Andhra Pradesh RMA
Author
First Published Aug 24, 2023, 5:21 AM IST

Andhra Pradesh Weather update: ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో గురువారం ప‌లు ప్రాంతాల్లో సాధార‌ణం నుంచి మోస్తారు వ‌ర్షాలు కురుస్తాయ‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. ఇదే స‌మ‌యంలో ప‌లు ప్రాంతాల్లో చిరుజ‌ల్లులు కురుస్తాయ‌ని తెలిపింది. పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు, నెల్లూరు, తిరుపతి సహా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. మిగిలిన జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు, నెల్లూరు, తిరుపతి సహా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. మిగిలిన జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, ప్రకాశం జిల్లాల్లో మంగళవారం అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. సాలూరు, పార్వతీపురం మన్యంలో 89.6 మిల్లీమీటర్లు, జియ్యమ్మవలసలో 69.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

ప్రకాశం జిల్లాలో మంగళవారం భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. తీవ్రమైన ఎండలతో పగలు ప్రారంభం కాగా, సాయంత్రం ఓ మోస్తరు వర్షంతో వాతావరణం చల్లబడింది. పగటి పూట గరిష్ఠ ఉష్ణోగ్రతలు 38 నుంచి 39.90 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యాయి. అయితే సాయంత్రానికి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో కొన్ని చోట్ల మోస్తరు వర్షం కురిసింది. పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులు, కూడళ్లు జలమయం కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. వాతావరణం ఒక్కసారిగా ఎండ, వేడి నుంచి మేఘావృతమై, గంటపాటు వర్షం కురిసింది. పగటిపూట ఎండ తీవ్రత, సాయంత్రం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తుండటంతో ఇతర జిల్లాల్లోనూ ఇదే తరహా వాతావరణం కనిపించింది.

Follow Us:
Download App:
  • android
  • ios