ఆంధ్రలో అవు కథ మొదలవుతున్నది

AP to supply cows on subsidy
Highlights

పేడ,గోమూత్రాన్ని ఎరువుగా వాడేందుకు ఆంధ్రలో అవులను సబ్సిడితో అందించాలనుకుంటున్నారు

నోట్ల బాధలెలా ఉన్న అంధ్ర నుంచి బిజెపికి చల్లటివార్త.

 

ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం ఆవుల పెంపకం  ప్రోత్సహించాలనుకుంటోంది. దీనికోసం ఆవులను కొనేవాళ్లకు ప్రభుత్వం  సబ్సడినికూడా అందిస్తుంది. ఆవుపేడను, మూత్రాన్ని విస్తారంగా వ్యవసాయంలో వాడేందుకు   ప్రభుత్వం అన్ని రకాల చర్యలను తీసుకుంటూ ఉంది. 

 

అవుల నుంచి వచ్చే రాబడి నుంచి   వోనరుడికి జీవనోపాధి లభించడమే కాదు,  రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కూడామెరుగుపరిచే ఒక మహత్తర "అవు- ఆరోగ్యం" అనే పథకం ప్రభుత్వం ప్రారంభిస్తున్నది.

 

అవుపేడను వినియోగించి చేసే సేంద్రియ వ్యవసాయం (అర్గానిక్ ఫార్మింగ్ ) వ్యాప్తి చేసి ఆర్గానిక్  కూరగాయల ఉత్పత్తి పెంచాలని  ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు ప్రభుత్వం నిర్ణయించింది.

 

 ఈ ఆర్గానిక్ పార్మింగ్ కోసం 13 జిల్లాలలో 131 వ్యవసాయ క్షేత్రాలను ప్రభుత్వం ఇప్పటికే ఎంపిక చేసింది. మరొక 160  వ్యవసాయ క్షేత్రాలలో ఆర్గానిక్ కూరగాయలు పండించాలని  ప్రభుత్వం భావిస్తున్నది.  ఈ వుత్పత్తుల కోసం రైతు బజార్లలో ప్రత్యేక దుకాణాలు కూడా తెరవాలని కూడా చూస్తున్నారు.

 

ఎంపిక చేసిన ప్రాంతాలలో వ్యవసాయ శాఖాధికారులు, అవుపేడను, గోమూత్రాన్ని వాడడం వల్ల వచ్చేప్రయోజనాల గురించి వివరించే క్యాంపెయిన్ కూడా చేపట్టారు. ఇలాగే ఆర్గానిక్ రైస్ ను కూడా ప్రోత్సహిస్తున్నారు. ఆర్గానిక్ ఆహార పదార్థాలకు మార్కెట్ లో మంచి డిమాండ్ వుండటంతో రైతులను ఆర్గానిక్ వరిపండించాలని అధికారులు రైతుల వెంటబడుతున్నారు.  సేంద్రియ ఎరువులతో కొంత దిగుబడి తగ్గినా, మార్కెట్ లో మంచి రేటు వస్తున్నందన, ఈ లోటుపూడుతుందని అధికారులు చెబుతున్నారు.

 

ఈ పథకం కింద గుంటూరు జిల్లాలో ఇప్పటికే 125 మంది ఆర్గానిక్  రైతులను గుర్తించి వారికి సబ్సిడి తో అవులను కొనీయడం జరిగిందని అధికారులు చెప్పారు.

 

loader