AP TET 2024: ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (ఏపీటెట్)–2024 నిర్వహణకు విద్యాశాఖ ఏర్పాటు చేస్తుంది. డీఎస్సీ పరీక్షకు అర్హత సాధించేందుకు నిర్వహిస్తున్న టెట్ పరీక్ష హాల్ టికెట్లను శుక్రవారం విడుదల చేసింది.
AP TET 2024: ఏపీలో ఉపాధ్యాయ నియామకాల్లో భాగంగా ముందుగా ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (ఏపీటెట్)–2024 నిర్వహణకు విద్యాశాఖ ఏర్పాటు చేస్తుంది. డీఎస్సీ పరీక్షకు అర్హత సాధించేందుకు నిర్వహిస్తున్న టెట్ పరీక్ష హాల్ టికెట్లను శుక్రవారం విడుదల చేసింది. అభ్యర్థుల హాల్ టికెట్లను అధికారిక వెబ్ సైట్ https://aptet.apcfss.in లో విడుదల చేసింది. అలాగే టెట్ పరీక్ష తేదీలను కూడా ప్రకటించింది. ఈ మేరకు అభ్యర్ధులు సదరు వెబ్ సైట్ లోకి వెళ్లి వీటిని డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ ఏడాది ఏపీ టెట్ పరీక్షకు 2.67 లక్షల మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. వారికి కోసం రాష్ట్ర వ్యాప్తంగా 120 పరీక్షా కేంద్రాలను కేటాయించారు. వారికి ఈనెల 27 నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకూ టెట్ పరీక్షలు నిర్వహిస్తారు. అభ్యర్ధులు ఎంచుకున్న పరీక్షా కేంద్రాల్ని మాత్రమే వారికి కేటాయించినట్లు అధికారులు తెలిపారు. అలాగే అభ్యర్థుల సౌకర్యం కోసం టెట్, డీఎస్సీ పరీక్షలపై హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాలపై ఎలాంటి వివరాలు కావాలన్నా విద్యాశాఖాధికారుల్ని సంప్రదించాలని అధికారులు సూచించారు. హెల్ప్ డెస్క్ నంబర్లు 9505619127 , 9705655349 8121947387, 8125046997. ఇది ఉదయం 8:00 నుండి సాయంత్రం 6:00 వరకూ పనిచేస్తుందన్నారు.
హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకోండిలా..
టెట్ హాల్ టికెట్ డౌన్ లోన్ కోసం.. అధికారిక వెబ్ సైట్ https://aptet.apcfss.in//ను సందర్శించాలి. ఆ వెబ్ సైట్ లోకి వెళ్లి.. అభ్యర్ఝి తన లాగిన్ వివరాలు ఎంటర్ చేయాలి. ఆ తరువాత హాల్ టికెట్లు డౌన్ లోడ్ అప్షన్ వస్తుంది. దానిపై క్లిక్ చేయగానే హాల్ టిక్కెట్ డౌన్ లోడ్ అవుతుంది. దానిని ప్రింట్ తీసుకుని సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. టెట్ అధికారిక వెబ్ సైట్ లో పరీక్షల తేదీలు, పరీక్షా కేంద్రాలు, ఇతర వివరాలను కూడా అందుబాటులో ఉంచారు. వీటి ప్రకారం. పరీక్షా తేదీ వివరాలు ఇలా ఉన్నాయి.
నిర్వహణ ఇలా..
పేపర్ 1ఏ : ఈనెల 27 నుంచి మార్చి 1 వరకు
పేపర్ 2ఏ : మార్చి 2, 3, 4, 6 తేదీలు
పేపర్ 1బి : మార్చి 5 (ఉదయం)
పేపర్ 2బి : మార్చి 5 (మధ్యాహ్నం)
ఇదిలా ఉంటే.. ప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఎస్‌జీటీ పోస్టులకు బీఈడీ చేసిన అభ్యర్థులు అనర్హులని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ తీర్పు నేపథ్యంలో బీఈడీ పూర్తి చేసి.. ఎస్‌జీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారి ఫీజును తిరిగి చెల్లించేందుకు విద్యాశాఖ చర్యలు తీసుకుంది. సదరు అభ్యర్థుల ఆధార్ కార్డుతో లింక్ అయ్యి ఉన్నా.. బ్యాంకు అకౌంట్‌కు వారి చెల్లించిన ఫీజు మొత్తాన్ని తిరిగి జమ చేయనున్నట్టు పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్ ప్రకటించింది.
