Asianet News TeluguAsianet News Telugu

తెలుగు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు: ముగిసిన ఈడీల భేటీ, కుదరని ఏకాభిప్రాయం

తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులు నడపడంపై ప్రతిష్టంభన వీడటం లేదు. రెండు రాష్ట్రాల ఆర్టీసీ ఈడీల మధ్య బుధవారం జరిగిన చర్చలు కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ముగిశాయి.

ap telangana rtc officials meeting completed
Author
Hyderabad, First Published Oct 7, 2020, 8:19 PM IST

తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులు నడపడంపై ప్రతిష్టంభన వీడటం లేదు. రెండు రాష్ట్రాల ఆర్టీసీ ఈడీల మధ్య బుధవారం జరిగిన చర్చలు కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ముగిశాయి.

రెండు రాష్ట్రాలు చెరో లక్షా 61 వేల కిలోమీటర్లు బస్సులు నడిపాలనే ప్రతిపాదన వచ్చిందన్నారు టీఎస్ఆర్టీసీ ఈడీ యాదగిరి. మరోసారి భేటీ అయి తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.  దీంతో దసరా పండుగ సీజన్‌లో తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులు ఉంటాయా, ఉండవా అని జనం ఆందోళన చెందుతున్నారు.

తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రోజుకు 1.60 లక్షల కిలోమీటర్ల మేర బస్సులు నడుపుతామని, ఏపీఎస్‌ఆర్టీసీ కూడా అన్ని కిలోమీటర్లకే పరిమితం కావాలని తెలంగాణ అధికారులు చెబుతున్నారు.

కానీ అందుకు ఏపీ అధికారులు అంగీకరించడం లేదు. మరోవైపు ఏపీ, తెలంగాణ మధ్య బస్సు సర్వీసులు ప్రారంభం కావాలంటే సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఏపీ రవాణాశాఖ మంత్రి పేర్ని నాని కొద్దిరోజుల క్రితం అన్నారు.

మొత్తానికి తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు సర్వీసులను తిప్పే విషయంలో ఏకాభిప్రాయానికి వస్తేనే ఇరు రాష్ట్రాల మధ్య పూర్తిస్థాయిలో మళ్లీ ఆర్టీసీ బస్సులు తిరిగేలా కనిపిస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios