ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై మండిపడ్డారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. మంగళవారం వరుస ట్వీట్లు చేసిన ఆయన జగన్ పాలనపై విమర్శలు గుప్పించారు.  

ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై మండిపడ్డారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. మంగళవారం వరుస ట్వీట్లు చేసిన ఆయన జగన్ పాలనపై విమర్శలు గుప్పించారు. 

‘‘ గత మూడేళ్లలో దళితులపై దాడులు, ఆడపిల్లలపై అత్యాచారాలు, కల్తీ మద్యం, ప్రతిపక్షాల నాయకులు కార్యకర్తలపై దాడులు, భూ కబ్జాలు, మైనింగ్ మాఫియా, శ్యాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, మట్టి మాఫియా, కోర్టు ధిక్కారాలు, చెత్త రోడ్లు, పూర్తిగా నిలిచిపోయిన అభివృద్ధి, లక్షల కోట్లలో ప్రభుత్వం విచ్చలవిడిగా చేస్తున్న అప్పులు, అధికార పార్టీ నేతల ఆగడాలు చూసి చూసి, సామాన్య ప్రజలు ఎప్పుడో డిసైడ్ అయిపోయారు ఈసారి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారే ఏపీకి సీఎం కావాలి అని ’’ అని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. 

‘‘ కానీ కేవలం మూడంటే మూడేళ్ళలో సొంత పార్టీ కార్యకర్తలు, అభిమానులకు కూడా జగన్ రెడ్డి నైజం, అతని అసమర్థ పాలన గురించి అర్థమైపోయింది. బహిరంగంగా తమ అసంతృప్తి వెళ్లగక్కడమే కాదు, ఈసారి తమ పార్టీ గెలిచే పరిస్థితి లేనే లేదని వారే స్వయంగా చెబుతున్నారు’’ అంటూ అచ్చెన్నాయుడు ట్వీట్‌లో పేర్కొన్నారు. 

Scroll to load tweet…