Asianet News TeluguAsianet News Telugu

5 కోట్లకు చేరుకుంటున్న ఆంధ్రప్రదేశ్ వెబ్ సైట్ సందర్శకులు

ప్రాచర్యం పొందుతున్న రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్స్

5 కోట్ల వీక్షణాలకు చేరుకుంటున్న స్టేట్ పోర్టల్

ఇక నుంచి 24X అప్డేటింగ్

AP state portal becomes a popular webstie

 అసలు యాత్రికులను  అకట్టుకునేందుకు  ఆంధ్రప్రదేశ  ప్రభుత్వం పడరాని పాట్లు పడుతూ ఉంటే, ఆంధ్ర ఇంటర్నెట్ యాత్రికుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతున్నది. దీనితో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన సమాచారన్ని 24 గంటలూ  విజిటర్స్ కు  అందించేందుకు   వివిధ శాఖల వెబ్ సైట్లను సమాయత్తం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

 

ప్రభుత్వ శాఖల వెబ్ సైట్ల ను పెద్ద ఎత్తున ప్రజలు సందర్శిస్తూ ఉండటంతో 24X7 సమాచారం అప్ డేట్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.  ఎపి సమాచారం కోసం  ప్రభుత్వ వెబ్ సైట్లను వీక్షించే వారి సంఖ్య లక్షలలో ఉంటున్నదని ప్రభుత్వ అధికారులు చెబుతన్నారు. ఏపీ స్టేట్ పోర్టల్ ( ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్)  ఐదు కోట్ల మంది విజటర్స్ దిశగా దూసుకుపోతోంది. నవంబర్ 4వ తేదీ ఉదయానికి  http://www.ap.gov.in/   సైట్ ను 4,98,95,618 సార్లు సందర్శించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలకు ఈ పోర్టల్ అనుసంధానంగా ఉంటుంది. ఏ శాఖకు సంబంధించిన సమచారాన్నైనా ఈ పోర్టల్ నుంచి పొందే అవకాశం ఉంది.

 

ముఖ్యమంత్రి ప్రతిష్టాకరంగా ప్రారంభించిన సీఎం ఆఫీస్ రియల్ టైమ్ ఎక్జిక్యూటివ్ డ్యాష్ బోర్డు http://core.ap.gov.in/cmdashboard/index.aspx ను 33,65,753 సార్లువీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే జీవోలు అందుబాటులో ఉండే http://goir.ap.gov.in/ వెబ్ సైట్ జూన్ 2014 నుంచి ఇప్పటి వరకు 1,99,23,063  సార్లు సందర్శించారు.  

 

పవిత్ర పుణ్యక్షేత్రం కలియుగదైవం శ్రీవేంకటేశ్వరుని దేవస్థానం పోర్టల్ http://www.tirumala.org/ ను కోటీ 53 లక్షల 95 వేల 468 సార్లు సందర్శించారు. శ్రీ వారి సేవలను ఆన్ లైన్లో బుక్ చేసుకోవడంతోపాటు, మీడియా సంస్థలకు తిరుమల సమాచారాన్ని అందించడం కోసం కూడా ఈ వెబ్ సైట్ ఉపయోగపడుతున్నది.   ఇక రాష్ట్రంలోని నిరుపేదలకు ఉచితంగా వైద్య సేవ అందిస్తున్న ఎన్టీఆర్ వైద్యసేవ http://www.ntrvaidyaseva.ap.gov.in/ వెబ్ సైట్ ను 52,33,474 సార్లు సందర్శించారు.  ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ వెబ్ సైట్ http://www.apagrisnet.gov.in ను 48,84,826 సార్లు వీక్షించారు.

 

ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ వెబ్ సైట్ http://www.apcob.org/ ను 32,52,781 మంది సందర్శించారు. ఇక శాంతి భద్రతలు, హోం శాఖకు సంబంధించి http://www.appolice.gov.in/   సైట్ ను ఇప్పటి వరకు 63,20,902 మంది విజిట్ చేశారు. రాష్ట్ర పర్యాటక రంగానికి వన్నెలు దిద్దుతున్న ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పోరేషన్ http://www.aptdc.gov.in/home.html ను సైతం దాదాపు 26 లక్షల సార్లు  సందర్శించారు.

 

ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ వెబ్ సైట్ http://www.forests.ap.gov.in/ ను 20 లక్షల సార్లు పరిశీలించారు.  ఇక ఎన్నికలు, ఓట్లు, మార్పులు చేర్పులకు ఆశ్రయించే రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్ సైట్ http://ceoandhra.nic.in/home.aspx ను ఇప్పటి వరకు వీక్షణలు 2,13,64,155 గా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్  వెబ్ సైట్ http://www.apsche.org/ ను ఇప్పటి వరకు 9,19,115 సార్లు సందర్శించారు. భూపరిపాలన శాఖ వెబ్ సైట్ http://ccla.ap.gov.in/CCLA/ సందర్శకులు సైతం 6,71,951 సార్లు వీక్షించారు.

Follow Us:
Download App:
  • android
  • ios