అమరావతి:  ఆంధ్రప్రదేశ్  అసెంబ్లీలో విపక్షనేత చంద్రబాబునాయుడు తీరుపై గురువారం నాడు స్పీకర్ తమ్మినేని సీతారాం అసహానం వ్యక్తం చేశారు. 

గురువారం నాడు  ఏపీ అసెంబ్లీలో అక్రమ కట్టడాల కూల్చివేతపై జరిగిన సందర్భంగా  విపక్ష నేత చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలపై  ఆయన స్పందించారు. తన నోరు మూయిస్తున్నారని చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలపై స్పీకర్ తమ్మినేని సీతారాం అసంతృప్తి వ్యక్తం చేశారు.

సభా సమయాన్ని విపక్ష సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన  సూచించారు. సభలో విపక్షాల గొంతు నొక్కే పరిస్థితి ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు.ప్రశ్నకు సంబంధించిన విషయమై మాట్లాడాలని స్పీకర్ చంద్రబాబుకు సూచించారు.  సభ్యుల హక్కులను తాను కాపాడుతానని స్పీకర్ తమ్మినేని సీతారాం సూచించారు.