Asianet News TeluguAsianet News Telugu

ఈ నెల 27న కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయమై జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ నెల 27న వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.

AP SEC Nimmagadda Ramesh kumar to conduct video conference with collectors and sps on Jan 27 lns
Author
Guntur, First Published Jan 26, 2021, 2:05 PM IST

అమరావతి:  స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయమై జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ నెల 27న వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.ఎన్నికల నిర్వహణకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై ఎస్ఈసీ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్ఈసీ సూచించే అవకాశాలున్నాయి.

ఈ నెల 8వ తేదీన  రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. ఎన్నికల నిర్వహణకు సుప్రీంకోర్టు సోమవారం నాడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 21వ తేదీన ఏపీ హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టేసింది.

also read:ఎన్నికల విధులకు అనర్హులు: గోపాలకృష్ణ ద్వివేది, గిరిజాశంకర్‌పై ఎస్ఈసీ సంచలనం

సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత ఎన్నికల నిర్వహణకు గాను ఎస్ఈసీ వేగంగా నిర్ణయాలు తీసుకొన్నారు. ఎన్నికల షెడ్యూల్ ను రీ షెడ్యూల్ చేశారు.గుంటూరు, చిత్తూరు కలెక్టర్లపై చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీ ఆదేశించింది. మరోవైపు తిరుపతి అర్బన్ ఎస్పీపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అంతేకాదు ఇద్దరు డీఎస్పీలు, నలుగురు సీఐలపై చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీ  ఉన్నతాధికారులకు లేఖ రాశారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios