Asianet News TeluguAsianet News Telugu

ఎన్నికల విధులకు అనర్హులు: గోపాలకృష్ణ ద్వివేది, గిరిజాశంకర్‌పై ఎస్ఈసీ సంచలనం

 పంచాయితీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, పంచాయితీరాజ్ శాఖ సెక్రటరీ గిరిజాశంకర్ లు ఎన్నికల విధులు నిర్వహించడానికి అనర్హులుగా ఎస్ఈసీ తెలిపింది.
 

AP SEC orders to remove two IAS officers from election duties lns
Author
Guntur, First Published Jan 26, 2021, 12:15 PM IST

అమరావతి:  పంచాయితీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, పంచాయితీరాజ్ శాఖ సెక్రటరీ గిరిజాశంకర్ లు ఎన్నికల విధులు నిర్వహించడానికి అనర్హులుగా ఎస్ఈసీ తెలిపింది.

ఇద్దరిని తొలగించాలని ప్రొసీడింగ్స్ ను ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసింది. ఓటర్ల జాబితా ప్రచురిస్తామని కోర్టుకు చెప్పి కూడా ఆ పనులు సక్రమంగా నిర్వహించలేదని  ప్రొసిడీంగ్స్ లో ఎస్ఈసీ తెలిపింది.

also read:చిత్తూరు, గుంటూరు కలెక్టర్ల బదిలీకి ఎస్ఈసీ సిఫారసు: సీఎస్ కు నిమ్మగడ్డ లేఖ

2021 ఓటర్ల జాబితా ప్రచురణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని కూడ ఎస్ఈసీ ఆరోపించింది.ఈ ఇద్దరిని తొలగించాలని కూడ ప్రొసిడింగ్స్ లో ఎస్ఈసీ ఆదేశించింది.ఈ ఇద్దరు అధికారులు ఎన్నికల విధులు నిర్వహణ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టుగా ఎన్నికల సంఘం అభిప్రాయపడింది. మూడు అంశాలను ప్రధానంగా ఈ ప్రొసిడింగ్స్ లో పేర్కొంది.

also read:ఇద్దరు ఐఎఎస్‌ల బదిలీ: గోపాలకృష్ణద్వివేది, గిరిజాశంకర్ పై వేటు

3.60 లక్షల మంది ఓటు హక్కుకు దూరమయ్యారని ఎస్ఈసీ పేర్కొంది. అధికారుల తప్పిదాలను సర్వీస్ రికార్డుల్లో పొందుపర్చాలని ఎస్ఈసీ ఆదేశించింది. 
అయితే ఈ ఇద్దరు అధికారులను బదిలీ చేసినట్టుగా పంచాయితీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోమవారం నాడే ప్రకటించిన విషయం తెలిసిందే.

Follow Us:
Download App:
  • android
  • ios