ఒంగోలు:  ఎన్ని ప్రయత్నాలు జరిగినా అంతిమ విజయం న్యాయానిదేనని ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పారు.

రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్లు రద్దు చేయాలని దాఖలైన రెండు పిటిషన్లను ఏపీ హైకోర్టు ఇవాళ కొట్టేసింది. గురువారం నాడు ప్రకాశం జిల్లాలో అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా ఆయన ఒంగోలులో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల నిలుపుదలకు ఆఖరి ప్రయత్నం కూడ అయిపోయిందన్నారు. 

also read:ఏకగ్రీవాలు శృతి మించితే అధికారుల వైఫల్యమే: నిమ్మగడ్డ రమేష్

న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం, విధేయత ఉందన్నారు. రాజ్యాంగంలో ఉన్నదే ఈసీ అమలు చేస్తోందని ఆయన చెప్పారు. తన పరిధిలో తాను బాధ్యతాయుతంగా పనిచేస్తానని ఆయన చెప్పారు.

గత మాసంలో ఎన్నికల నిర్వహణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది ఎన్నికల సంఘం. ఎన్నికల నిర్వహణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల సంఘానికి మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకొంది.

ఎన్నికల సంఘం తీసుకొన్న కొన్ని నిర్ణయాలను రాష్ట్ర ప్రభుత్వం తిప్పి పంపిన ఘటనలు కూడ ఉన్నాయి. తాను తీసుకొన్న నిర్ణయాలను ఎన్నికల సంఘం కూడ వెనక్కి తిప్పి పంపింది.