ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల కోడ్‌ను నిలుపుదల చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమీషన్ గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ఉత్తర్వులతో కూడిన ప్రకటనను ఎస్ఈసీ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఎటువంటి ఎన్నికల ప్రచారం నిర్వహించకూడదని ఎన్నికల సంఘం హెచ్చరించింది.

ఈసీ ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు సంక్షేమ పథకాలను అమలు చేసుకోవడానికి జగన్ సర్కార్‌కు వీలు కలుగుతుంది.

Also Read:వైఎస్ జగన్ కు షాక్: స్థానిక ఎన్నికలపై తేల్చేసిన సుప్రీంకోర్టు

ఈ మధ్యకాలంలో ఎటువంటి ఎన్నికల ప్రచార కార్యక్రమాలు నిర్వహించరాదు.. ముఖ్యంగా నామినేషన్ వేసిన అభ్యర్ధులే కాకుండా వారి అనుచరులు, బంధువులు కానీ ఎలాంటి ప్రచారాలు చేపట్టకూడదని ఈసీ తెలిపింది.

ఇందుకు సంబంధించి అన్ని పార్టీలు, అభ్యర్ధులపై నిఘా కొనసాగుతుందని ఎన్నికల సంఘం హెచ్చరించింది. ఈ నెల 25న ఉగాది నాడు ఇళ్ల పట్టాల కార్యక్రమం కూడా యధావిథిగా కొనసాగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 

Also Read:లండన్ నుంచి కూతుర్లు వెనక్కి: జగన్ పారాసిటమాల్ వ్యాఖ్యలపై సెటైర్లు

ఏపీ స్థానిక సంస్థల ఎన్నకల వాయిదాపై సుప్రీంకోర్టు బుధవారం తన తీర్పును వెలువరించింది. ఎన్నికల నిర్వహణపై అధికారం ఈసీకే ఉంటుందని సుప్రీంకోర్టు తేల్చేసింది. అయితే, కోడ్ ను మాత్రం ఎత్తేయాలని సూచించిన సంగతి తెలిసిందే. అయితే, కొత్త ప్రాజెక్టులను మాత్రం ఈసీని సంప్రదించిన తర్వాతనే చేపట్టాలని ప్రభుత్వానికి సూచించింది.