Asianet News TeluguAsianet News Telugu

మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు: ఏపీ ఎస్ఈసీ కీలక ఆదేశాలు

రాష్ట్రంలోని 12 మున్సిపల్ కార్పోరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నికకు ప్రత్యేక సమావేశం నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించారు.

AP SEC issues orders for officials over mayor and Dy. Mayor elections for 12 municipalities lns
Author
Amaravathi, First Published Mar 11, 2021, 2:41 PM IST

అమరావతి: రాష్ట్రంలోని 12 మున్సిపల్ కార్పోరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నికకు ప్రత్యేక సమావేశం నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించారు.ఈ మేరకు గురువారం నాడు ఆయన ఆదేశాలు జారీ చేశారు. 

కలెక్టర్లు, జేసీలను ప్రిసైడింగ్ అధికారులుగా నియమించాలని పురపాలక శాఖ కమిషనర్ ను ఆదేశించారు.. రెండు కార్పోరేషన్లు ఉన్న చిత్తూరు, కృష్ణా జిల్లాలపై ఎస్ఈసీ ప్రత్యేక సూచనలు చేశారు.

ప్రిసైడింగ్ అధికారిగా జేసీ రెవిన్యూలను నియమించాలని ఆయన ఆదేశించారు.రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు ఈ నెల 10వ తేదీన జరిగాయి.ఈ నెల 14వ తేదీన ఎన్నికల ఫలితాలు రానున్నాయి. 

ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత  మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహణ కోసం ప్రత్యేకంగా సమావేశాలను నిర్వహించనున్నారు. ఈ సమావేశాల నిర్వహణ కోసం ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు.

ఈ ఎన్నికల్లో కూడ గ్రామ పంచాయితీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే వస్తాయని వైసీపీ ధీమాగా ఉంది. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ అన్ని వ్యవస్థలను ఉపయోగించుకొని విజయం కోసం ప్రయత్నాలు చేసిందని విపక్షాలు విమర్శలు చేశాయి. 


 

Follow Us:
Download App:
  • android
  • ios