అమరావతి: స్థానిక సంస్థలను నిలిపివేయాలని కోరుతూ ఏపీ  ప్రభుత్వం దాఖలు చేసిన  పిటిషన్ ను డిస్మిస్ చేయాలని ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం నాడు హైకోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది.

ఏపీలో రాష్ట్రంలో  స్థానిక సంస్థల ఎన్నికలను నిలిపివేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.ఈ పిటిషన్ కు రాష్ట్ర ఎన్నికల సంఘం కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది.

also read:ఫిబ్రవరిలో స్థానిక సంస్థలు నిర్వహణ సాధ్యం కాదు: హైకోర్టులో జగన్ సర్కార్ అడిషనల్ అఫిడవిట్

రాష్ట్రంలో కరోనా కేసుల కారణంగా ఎన్నికలను నిర్వహించలేమని ప్రభుత్వం గతంలోనే స్పష్టం చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి మాసంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయాల్సి ఉన్నందున  స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని ప్రభుత్వం హైకోర్టు దృష్టికి తెచ్చింది.కరోనా వ్యాక్సిన్ పంపిణీ పేరుతో ఎన్నికలు అడ్డుకోవద్దని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. 

 

ఏపీలో గతంలో రోజూ 10 వేల కరోనా కేసులు నమోదయ్యేవి. ప్రస్తుతం కరోనా కేసులు మూడు వేలకు కూడ మించడం లేదని కౌంటర్ అఫిడవిట్ లో  ప్రభుత్వం ప్రకటించింది.

ఇప్పటికే స్కూల్స్, థియేటర్స్, మాల్స్ కు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయాన్ని కౌంటర్ అఫిడవిట్ లో  ఎన్నికల సంఘం గుర్తు చేసింది.వ్యాక్సిన్ ఇంకా ట్రయల్స్ దశలోనే ఉందని ఎస్ఈసీ పేర్కొంది. 

ఎన్నికల సంఘం విధుల్లో ప్రభుత్వాలు జోక్యం చేసుకోవద్దని గతంలోనే సుప్రీం సూచించిన విషయాన్ని కౌంటర్ లో ఎస్ఈసీ ప్రస్తావించింది. 

ఇటీవలే జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగాయని పేర్కొంది. అదే విధంగా బీహార్, రాజస్థాన్ లలో స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయాన్ని ఎస్ఈసీ అఫిడవిట్ లో తెలిపింది.