చంద్రబాబు ఆరోగ్యంపై జైళ్ల శాఖ డీఐజీ రవికుమార్ స్పందన.. ఏమన్నారంటే..

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టైన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు  నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే.

AP Prisons department Officials condemn chandrababu unhealthy news ksm

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టైన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు  నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. జైలులో ఉన్న చంద్రబాబు అస్వస్థతకు గురయ్యారనే వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని ఏపీ జైళ్ల శాఖ చెబుతోంది. కోస్తాంధ్ర జైళ్ల శాఖ డీఐజీ  రవికుమార్ స్పందిస్తూ.. కోర్టు గైడెన్స్ ప్రకారం చంద్రబాబుకు సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. చంద్రబాబు ఆయనకు అనారోగ్యంగా ఉన్నట్టుగా చెప్పలేదని తెలిపారు.

ప్రోటోకాల్ ప్రకారమే తాము పనిచేస్తున్నామని అన్నారు. చంద్రబాబు డీహైడ్రేషన్‌కు గురయ్యారనే వార్తలు అవాస్తమని చెప్పారు. చంద్రబాబుకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటే తనకు తెలుస్తుందని అన్నారు. చంద్రబాబు ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు.ఆయన ఇంటి ఆహారం తీసుకుంటున్నారని చెప్పారు. చంద్రబాబుకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా ఆయన కోసం సెంట్రల్ జైలులో పది మంది వైద్యులు ఉన్నారని వెల్లడించారు. ఎమర్జెన్సీ అయితే 108 సిద్ధంగా ఉందని తెలిపారు. చంద్రబాబుకు ఎండ తీవ్రత, అస్వస్థత అనేది అవాస్తమని చెపపారు. తప్పుడు కథనాలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని డీఐజీ రవికుమార్ హెచ్చరించారు.

ఇదిలాఉంటే, రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ రేపటి నుంచి 4 రోజులు సెలవుపై వెళ్లనున్నారు. దీంతో రాజమండ్రి జైలు ఇంచార్జ్ సూపరింటెండెంట్‌గా డిప్యూటీ సూపరింటెండెంట్‌ రాజ్ కుమార్ బాధ్యతలు చేప్టటనున్నారు. 

ఇక, చంద్రబాబుతో మంగళవారం మధ్యాహ్నం ఆయన భార్య భువనేశ్వరి, కోడలు నారా బ్రాహ్మణితో పాటు టీడీపీ నేత పయ్యావుల కేశవ్ ములాఖత్ అయ్యారు. ఆయన యోగక్షేమాలు అడగ్గా.. డీహైడ్రేషన్ కు గురవుతున్నట్లు తెలిపినట్లు సమాచారం. ఈ విషయాన్ని జైలు అధికారులు, మెడికల్ ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లినట్లు చంద్రబాబు వారితో చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశాయి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios