విశాఖపట్టణం: గీతం యూనివర్శిటీ భూ కబ్జాలపై విచారణ జరపాలని ప్రజా సంఘాల జేఎసీ సీబీఐ ఫిర్యాదు చేసింది.

గత 40 ఏళ్లుగా గీతం యూనివర్శిటీ  భూ కబ్జాలకు పాల్పడిందని ఆరోపించారు. ఆక్రమించిన భూముల్లో ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపట్టారని జేఏసీ నేతలు సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

గీతం యూనివర్శిటీ గుర్తింపును రద్దు చేయాలని కోరారు. యూనివర్శిటీ ఆక్రమించుకొన్న భూములను  ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నట్టుగా జేఎసీ  నేతలు చెప్పారు.

also read:గీతం యూనివర్శిటీలో కూల్చివేతలు: నవంబర్ 30 వరకు స్టే ఇస్తూ హైకోర్టు ఆదేశాలు

గీతం యూనివర్శిటీ అక్రమాలకు చంద్రబాబునాయుడు మద్దతు పలకడాన్ని జేఏసీ తప్పుబట్టారు.

గీతం యూనివర్శిటీ ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు చేపట్టిందని ఆరోపిస్తూ రెవిన్యూ అధికారులు ఈ నెల 24వ తేదీన అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది ప్రభుత్వం. మరో వైపు ఈ కూల్చివేతలను నిరసిస్తూ గీతం యూనివర్శిటీ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. గీతం యూనివర్శిటీ ఈ విషయమై హైకోర్టును ఆశ్రయించింది. నవంబర్ 30వ తేదీ వరకు హైకోర్టు స్టే ఇచ్చిన విషయం తెలిసిందే.