అమరావతి: గీతం యూనివర్శిటీ కట్టడాల కూల్చివేతపై ఏపీ హైకోర్టు ఈ ఏడాది నవంబర్ 30వ తేదీ వరకు స్టే ఇస్తూ ఏపీ  హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ విషయమై కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది కోర్టు.నోటీసులు ,ఆర్డర్లు లేకుండా కూల్చడం సరికాదని పిటిషనర్ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

యూనివర్శిటీ ప్రైవేట్ భూముల్లో నిర్మాణాలు కూల్చారని పిటిషనర్ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.అదనపు భూమి కొనడానికి డాక్యుమెంట్ ప్రభుత్వం వద్దే పెండింగ్ లో ఉందని పిటిషనర్ చెప్పారు. 

also read:జగన్ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ: గీతం కూల్చివేతలపై హైకోర్టు ఆదేశాలు

తెల్లవారుజామున 2 గంటల సమయంలో 100 మంది పోలీసులతో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారని పిటిషనర్ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.ఉదయం కూల్చివేస్తే ట్రాఫిక్ కు ఇబ్బందని తెల్లవారుజామున కూల్చామని ప్రభుత్వం  తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

also read:చంద్రబాబు బంధువులు అయితే భూములు వదిలేయాలా?: గీతం భూములపై బొత్స

ఇరువురి వాదనలను విన్న హైకోర్టు నవంబర్ 30వ తేదీ వరకు స్టే ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్ పై విచారణను నవంబర్ 30వ తేదీకి వాయిదా వేసింది.