Asianet News TeluguAsianet News Telugu

ఏపీ రాజకీయాల్లో ‘తిరువూరు’ చిచ్చు.. వైసీపీకి రక్షణనిధి, టీడీపికి కేశినేని నాని షాక్ లు...

మార్పులు, చేర్పులు వైసీపీ నేతల్లో తీవ్ర అసంతృప్తిని రగులుస్తున్నాయి. దీంతో టికెట్ దక్కని నేతలు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. వైసిపిని విడిచి వెళ్లడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే 2019లో తిరువూరు నుంచి  గెలిచిన ఎమ్మెల్యే రక్షణనిధికి కూడా ఈసారి వైసిపి టికెట్ ఇవ్వబోమని ముఖ్యమంత్రి జగన్ చెప్పినట్లు తెలుస్తోంది. 

AP politics : Will Tiruvuru YCP MLA Rakshana Nidhi change party? TDP leader kesineni nani change party - bsb
Author
First Published Jan 11, 2024, 6:52 PM IST

తిరువూరు..  ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో గట్టిగా వినిపిస్తున్న నియోజకవర్గం. తిరువూరు రగడతో ఇటీవలే టిడిపి నుంచి ఓ నేత వైసీపీలో చేరగా ఇప్పుడు తిరువూరుకు చెందిన వైసిపి నేత పార్టీ మారతారని ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. తిరువూరు సిట్టింగ్ ఎమ్మెల్యే రక్షణ నిధి అధిష్టానం ఫోనుకు స్పందించడం లేదు. మార్పులు చేర్పుల్లో భాగంగా.. తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధికి ఈసారి టికెట్  నిరాకరించబోతున్నారు జగన్. ఈ విషయం లీక్ కావడంతో రక్షణ నిధి మనస్థాపానికి గురయ్యారని.. అందుకే క్యాంప్ ఆఫీసు నుంచి వచ్చిన ఫోన్ కూడా ఎత్తడం లేదని అంటున్నారు. 

మార్పులు, చేర్పులు వైసీపీ నేతల్లో తీవ్ర అసంతృప్తిని రగులుస్తున్నాయి. దీంతో టికెట్ దక్కని నేతలు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. వైసిపిని విడిచి వెళ్లడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే 2019లో తిరువూరు నుంచి  గెలిచిన ఎమ్మెల్యే రక్షణనిధికి కూడా ఈసారి వైసిపి టికెట్ ఇవ్వబోమని ముఖ్యమంత్రి జగన్ చెప్పినట్లు తెలుస్తోంది. రక్షణ నిధి తిరువూరు నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా.. మాణికం ఠాగూర్

ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తనకు వైసిపి టికెట్ ఇవ్వడానికి నిరాకరించడంతో తీవ్ర అసహనానికి లోనైనట్లుగా తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన వైయస్ జగన్ పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ అయోధ్య రామిరెడ్డి, మర్రి రాజశేఖర్ లను పంపించి బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ రక్షణ నిధి పార్టీని వీడడానికే నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. పార్టీలో కొనసాగాలంటే తిరువూరు అసెంబ్లీ టికెట్ ఇవ్వాల్సిందేనని.. లేదంటే మరో పార్టీ చూసుకుంటానని వారితో తెగేసి చెప్పినట్లుగా కూడా తెలుస్తోంది.

బుజ్జగింపులు పనిచేయకపోవడంతో రక్షణ నిధికి నేరుగా సీఎంవో నుంచి ఫోన్ వెళ్ళింది. కానీ, దీనికి కూడా ఆయన స్పందించలేదట.  బుధవారం నాడు ఈ మేరకు అయోధ్య రామిరెడ్డి, మర్రి రాజశేఖర్ లు సీఎమ్ఓకు రావాలని రక్షణ నిధిని కోరారు. కానీ, దీనికి ఎమ్మెల్యే రక్షణ నిధి ఒప్పుకోలేదట. తనకు పార్టీ టికెట్ ఇస్తే కానీ తన నిర్ణయాన్ని మార్చుకోనంటూ మొండిపట్టు పట్టుకుని కూర్చున్నారట. 

ఈ క్రమంలోనే రక్షణ నిధి పార్టీ వీడడం ఖాయం అంటూ.. రక్షణ నిధి వర్గం చెబుతోంది.వైసిపి కేడర్ మాత్రం ఎమ్మెల్యేకు సీటు లేదని స్పష్టమైన సంకేతాలు ఉండడంతోనే ఇలాంటి నిర్ణయానికి వచ్చాడని అనుకుంటున్నాయి.  దీంతో త్వరలోనే రక్షణ నిధి పార్టీ మార్పుపై కీలక నిర్ణయం తీసుకుంటారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

మరోవైపు తిరువూరు.. టిడిపిలో కూడా  ఓ అగ్రనేత  మారడానికి కారణమయ్యింది. టిడిపి విజయవాడ ఎంపీ కేశినేని నాని, టిడిపి నేత,  కొడాలి నాని తమ్ముడు కేశినేని చిన్నిల మధ్య  ఉన్న విభేదాలు తిరువూరు వేదికగానే తీవ్రమయ్యాయి. పార్టీ కార్యాలయంలోనే నాని, చిన్ని వర్గాలు కొట్టుకున్నాయి. దీంతో సీరియస్ అయిన టీడీపీ అధిష్టానం కేశినేని నానిని మందలించింది. తిరువూరు విషయంలో జోక్యం చేసుకోవద్దని చెప్పింది.  

తిరువూరులో జరిగే చంద్రబాబు నాయుడు సభ విషయంలో పట్టించుకోవద్దని..  ఏ విషయాల్లో జోక్యం చేసుకోవద్దని చెప్పడంతో.. నాని గురువారం నాడు వైఎస్ జగన్ తో భేటీ అయ్యారు, వైసీపీలో చేరారు. ఇదే సమయంలో తిరువూరు వైసీపీ నేత రక్షణ నిధి పార్టీని వీడతారని వినిపిస్తుండడంతో.. ఆయన ఎటువైపు వెళతారనేది ఆసక్తికరంగా మారింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios