Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా.. మాణికం ఠాగూర్

వైఎస్ షర్మిలకు కాంగ్రెస్లో సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు. వైఎస్ షర్మిలకు ఆంధ్రప్రదేశ్ లో బాధ్యతలు అప్పగిస్తామని తెలిపారు. ఆమెను కాంగ్రెస్ పార్టీలోని ప్రతి ఒక్కరు సాధరంగా ఆహ్వానించారని గుర్తు చేశారు. 

Special status for AP if Congress comes to power.. Manickam Tagore - bsb
Author
First Published Jan 11, 2024, 5:40 PM IST

ఒంగోలు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి  మాణిక్యం ఠాకూర్ అధికార వైసిపి, ప్రతిపక్ష టీడీపీలపై విరుచుకుపడ్డారు. కేంద్ర,  రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నాలుగున్నర ఏళ్లలో చేసింది ఏమీ లేదన్నారు.  కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు. రాహుల్ గాంధీ చేసే మొదటి సంతకం అదే ఉంటుందని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన వైసిపి.. ఆ తర్వాత మరిచిపోయిందన్నారు.  

కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి.. మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు కల్పించడంలో విఫలమయ్యారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ కు కావలసిన అన్ని ప్రాజెక్టులు కాంగ్రెస్ ఇస్తుందని అన్నారు. వైఎస్ షర్మిలకు కాంగ్రెస్లో సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు. వైఎస్ షర్మిలకు ఆంధ్రప్రదేశ్ లో బాధ్యతలు అప్పగిస్తామని తెలిపారు. ఆమెను కాంగ్రెస్ పార్టీలోని ప్రతి ఒక్కరు సాధరంగా ఆహ్వానించారని గుర్తు చేశారు. 

కేశినేని నానికి వైఎస్ జగన్ ఇచ్చిన ఆఫర్ ఏంటీ .. బెజవాడలో ఇదే హాట్ టాపిక్

షర్మిలే కాదు కాంగ్రెస్ పార్టీలోకి ఎవరు వచ్చినా సాధారంగా ఆహ్వానిస్తామని తెలిపారు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో వైఎస్ షర్మిలకు సముచిత స్థానం కల్పిస్తామని అన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉందని మండిపడ్డారు.  జగన్ ప్రభుత్వం  సాండ్, ల్యాండ్, మైన్, వైన్ లపై నడుస్తుందని విమర్శించారు. జగన్ ప్రభుత్వంలో జరిగిన అన్ని అవకతవకలపై విచారణ కోరతామని తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios