AP politics Roundup 2021: చంద్రబాబుకు కొడాలితో చెక్, నాని విమర్శలకు కౌంటర్ ఇవ్వలేని టీడీపీ
చంద్రబాబు, టీడీపీపై మంత్రి కొడాలి నాని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తారు. టీడీపీపై విమర్శలు చేయడంలో మంత్రి నాని ముందుంటారు. కొన్ని సమయాల్లో మంత్రి నాని వ్యక్తిగత విమర్శలకు కూడా దిగారు.
అమరావతి: టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు సహా ఆ పార్టీకి చెందిన కీలక నేతలపై ఏపీ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపైనా, జగన్ పై విమర్శలు చేస్తే టీడీపీపై కౌంటర్ దాడి చేయడంలో కొడాలి నాని ముందుంటారు. Tdpపై, చంద్రబాబుపై కొడాలి నాని చేసిన విమర్శలు కొన్ని సమయాల్లో వైసీపీని ఆత్మరక్షణలో నెట్టాయి. మరికొన్ని సమయాల్లో ఆ పార్టీదే పైచేయిగా నిలిపాయి. టీడీపీపై ఒంటికాలిపై విమర్శలు చేసే మంత్రుల్లో కొడాలి నాని ముందుంటారు. తొలుత గుడివాడ నుండి కొడాలి నాని అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో వైఎస్ జగన్ వైసీపీని ఏర్పాటు చేసిన సమయంలో గుడివాడ ఎమ్మెల్యే Kodali Nani జగన్ కు జై కొట్టారు. అప్పటి నుండి చంద్రబాబుపై, టీడీపీ పై ఒంటికాలిపై విమర్శలు గుప్పిస్తున్నారు.
2019 ఎన్నికల్లో Chandrababu నేతృత్వంలోని టీడీపీ ఓటమి పాలైంది. Ycp అధికారంలోకి వచ్చింది. జగన్ కేబినెట్ లో కొడాలి నానికి చోటు దక్కింది. కేబినెట్ లో చోలు దక్కిన నాటి నుండి టీడీపీపై విమర్శల దాడిని మరింత పెంచారు.. ఈ విమర్శలు చేసే సమయంలో కొన్ని సమయాల్లో పత్రికల్లో రాయలేని బాషను కూడా మంత్రి ఉపయోగిస్తారనే విమర్శలు కూడ లేకపోలేదు Andhra pradesh రాజకీయాల్లో ప్రత్యర్ధులపై విమర్శలు చేసే సమయంలో అనుచితమైన వ్యాఖ్యలను ఉపయోగించడానికి మంత్రి కొడాలి నాని పెట్టింది పేరు అనే చర్చ కూడా లేకపోలేదు.
also read:బ్రిటిష్ నిరంకుశానికి 2.0 లా జగన్ రెడ్డి పాలన...: అచ్చెన్నాయుడు ఆగ్రహం
చంద్రబాబుతో సహా లోకేష్ పై కూడా సమయం దొరికినప్పుడల్లా కొడాలి నాని పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. లోకేష్ పై కొన్ని సమయాల్లో వ్యక్తిగత విమర్శలకు దిగాడు. చంద్రబాబుపై పరుష పదజాలంతో కూడా మంత్రి కొడాలి నాని తీవ్ర విమర్శలు చేసిన విషయం ఏపీ రాజకీయాల్లో పెద్ద ఎత్తున దుమారం రేగింది. ఎదురు దాడితో టీడీపీ నేతలకు కొండాలి నాని కౌంటర్ ఇస్తున్నారు. తాను చేసే విమర్శలతో ప్రత్యర్ధులకు నాని చుక్కలు చూపిస్తున్నారు.
రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు విషయంలో సీఎం జగన్ కు చంద్రబాబు లేఖ రాసిన అంశంపై కూడా ఏపీ మంత్రి సెటైరికల్ గా స్పందించారు. తుప్పుగాడు చంద్రబాబు, పప్పుగాడు లోకేష్ అంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడుని పగటి వేషగాడు అంటూ మంత్రి విమర్శలు గుప్పించారు.ఒకానొక సమయంలో సైకిల్ గుర్తు కోసం చంద్రబాబు ఎవరిని ఎవరి కోసం పంపారో అందరికి తెలుసునని కూడా వ్యాఖ్యలు చేశారు.కరోనా వ్యాక్సిన్ విషయంలో ఏపీ సర్కార్ విఫలమైందని చంద్రబాబునాయుడు చేసిన విమర్శలపై అదే స్థాయిలో మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. తమ పరిశోధనలో ఎన్‌సీబీ 420 వైరస్ ను గుర్తించామని కూడా మంత్రి నాని టీడీపీకి కౌంటర్ ఇచ్చారు.
ఓటుకు నోటుకు కేసు గురించి కూడా చంద్రబాబుపై మంత్రి నాని విమర్శలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకొంది. ఈ నిర్ణయంపై కూడా తనదైన శైలిలో మంత్రి విమర్శలు చేశారు.ఓటుకు నోటు కేసుతో హైద్రాబాద్ కు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకొన్నారు. ఇప్పుడేమో స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకొన్నారన్నారని ఆయన సెటైర్లు వేశారు. Amaravtiనే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ పై కూడా కొడాలి నాని స్పందించారు. చంద్రబాబు చెప్పే సామాజిక న్యాయం కమ్మ కులానికి న్యాయం చేయడమేనా అని ఆయన ప్రశ్నించారు.
వైఎస్ జగన్ Tirumalaటూర్ సమయంలో డిక్లరేషన్ పై టీడీపీ సహా విపక్షాల విమర్శలకు మంత్రి కొడాలి నాని ధీటుగా జవాబు ఇచ్చారు.భార్యతో కలిసి ఆలయాలకు వెళ్లాలని మోడీకి చెప్పాలని మంత్రి నాని బీజేపీకి సలహా ఇచ్చారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశంలో చోటు చేసుకొన్న పరిణామాలపై కూడా చంద్రబాబుపై మంత్రి నాని విమర్శలు చేశారు. తాను సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాతే అసెంబ్లీకి అడుగు పెడతానని చంద్రబాబు నాయుడు శపథం చేశారు. ఈ థపథాన్ని మంగమ్మ శపథం అంటూ కొడాలి నాని చంద్రబాబుపై సెటైర్లు వేశారు.
ఇదిలా ఉంటే మంత్రి కొడాలి నాని చేసే విమర్శలకు అదే స్థాయిలో సమాధానం చెప్పే నేతలు టీడీపీలో లేరు. నాని తరహలో విమర్శలు చేయడం టీడీపీలో లేకుండా పోయారు. గతంలో జగన్ పై టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి చేసిన అనుచిత వ్యాఖ్యలు చేసిన సమయంలో మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేతలు ప్రస్తావించారు. కొడాలి నాని సహా వైసీపీ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యల గురించి ప్రజలు ఆలోచించాలని చంద్రబాబు ప్రజలను కోరారు. పట్టాభి అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణ చెబుతున్నట్టుగా చెప్పారు. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి తమపై చేసిన అనుచిత వ్యాఖ్యల గురించి వేైసీపీ నేతలకు ఎలాంటి శిక్ష వేయాలని చంద్రబాబు ప్రజలను ప్రశ్నించారు.