సోమవారం నుంచి రాజధాని రైతుల మహా పాదయాత్ర: పోలీసుల అనుమతి.. కానీ మెలిక, ఏంటంటే..?

అమరావతిని (amaravathi) ఏపీకి ఏకైక రాజధానిగా (ap capital)  కొనసాగించాలంటూ తీవ్రస్థాయిలో ఉద్యమం సాగిస్తున్న రైతులు మహా పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ‘‘ న్యాయస్థానం టు దేవస్థానం ’’ పేరిట (nyayasthanam to devasthanam) తుళ్లూరు (thulluru) నుంచి తిరుమల (tirumala) వరకు యాత్ర నిర్వహించనున్నారు.

ap police department gives nod to amaravati farmers maha padayatra

అమరావతిని (amaravathi) ఏపీకి ఏకైక రాజధానిగా (ap capital)  కొనసాగించాలంటూ తీవ్రస్థాయిలో ఉద్యమం సాగిస్తున్న రైతులు మహా పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ‘‘ న్యాయస్థానం టు దేవస్థానం ’’ పేరిట (nyayasthanam to devasthanam) తుళ్లూరు (thulluru) నుంచి తిరుమల (tirumala) వరకు యాత్ర నిర్వహించనున్నారు. ఈ మహా పాదయాత్ర నవంబరు 1 నుంచి డిసెంబరు 17 వరకు జరగనుంది. దీనికి శనివారం ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ (ap police department) నుంచి అనుమతి లభించింది. అయితే ఈ యాత్రకు పోలీసులు కొన్ని షరతులు విధించారు.

షరతులు ఇవే:

  • ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య మాత్రమే యాత్ర కొనసాగించాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ సూచించారు. 
  • అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధులు హైకోర్టుకు సమర్పించిన జాబితాలో ఉన్న 157 మంది మాత్రమే మహా పాదయాత్రలో పాల్గొనాలని స్పష్టం చేశారు. అలాగే పాదయాత్రలో పాల్గొనేవారు కచ్చితంగా ఐడీ కార్డులు ధరించాలని ఆదేశించారు.
  • పాదయాత్ర సందర్భంగా డీజే సౌండ్ సిస్టమ్స్ వినియోగించరాదని స్పష్టం చేశారు. ఒకటి రెండు పోర్టబుల్ హ్యాండ్ మైకులు మాత్రమే వినియోగించాలని స్పష్టం చేశారు.
  • రైతుల పాదయాత్రకు ఆయా జిల్లాల్లో పోలీసులు రక్షణ కల్పించాలని.. బందోబస్తు ఏర్పాట్లు చేయాలని గుంటూరు అర్బన్, గుంటూరు రూరల్, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి నగర పోలీసు ఉన్నతాధికారులకు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. పాదయాత్ర జరిగినన్ని రోజులు వీడియో చిత్రీకరణ చేయాలని పోలీసులు సూచించారు.  

కాగా.. మహా పాదయాత్రకు తొలుత పోలీసుల అనుమతి కోరారు రైతులు. అయితే శాంతిభద్రతల దృష్ట్యా మహా పాదయాత్రకు అనుమతివ్వలేమని డీజీపీ (ap dgp) గౌతమ్‌ సవాంగ్‌ (gautam sawang) అమరావతి పరిరక్షణ సమితికి లేఖ రాశారు. దీంతో మహా పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని కోరుతూ రాజధాని రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు (ap high court) రైతుల మహా పాదయాత్రకు శుక్రవారం అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. 

ALso Read:అమరావతి రైతులకు ఊరట.. మహా పాదయాత్రకు హైకోర్టుకు గ్రీన్‌సిగ్నల్

కోర్టు తీర్పు నేపథ్యంలో నవంబరు 1న తొలిరోజు తుళ్లూరు నుంచి తాడికొండ వరకు పాదయాత్ర సాగనుంది. అక్కడి నుంచి తాడికొండ, గుంటూరు అమరావతి రోడ్డు, పుల్లడిగుంట, ఏటుకూరు, ప్రత్తిపాడు, పెదనందిపాడు, ఒంగోలు, టంగుటూరు, సింగరాయకొండ, కావలి, నెల్లూరు, కోవూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట, తిరుపతి, అలిపిరి మార్గం గుండా తిరుమలకు యాత్ర చేరుకుంటుంది. తమ పాదయాత్రకు అందరూ మద్దతు తెలిపి విజయవంతం చేయాలని రైతులు కోరుతున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios