అమరావతి రైతులకు ఊరట.. మహా పాదయాత్రకు హైకోర్టుకు గ్రీన్‌సిగ్నల్

మహా పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని కోరుతూ రాజధాని రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు (ap high court) రైతుల మహా పాదయాత్రకు అనుమతిచ్చింది. దీనిపై రైతులు హర్షం వ్యక్తం చేశారు.  

ap high court allows amaravathi farmers maha padayatra

అమరావతి ఉద్యమాన్ని (amaravathi) రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు గాను రాజధాని రైతులు మహా పాదయాత్రకు (maha padayatra) సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. నవంబరు 1 నుంచి  ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు’ పేరుతో 45 రోజుల పాటు పాదయాత్ర చేయాలని అమరావతి పరిరక్షణ సమితి (amaravathi jac), రాజధాని రైతు జేఏసీ నిర్ణయించాయి. దీనిలో భాగంగా పాదయాత్రకు పోలీసుల అనుమతి కోరారు. శాంతిభద్రతల దృష్ట్యా మహా పాదయాత్రకు అనుమతివ్వలేమని డీజీపీ (ap dgp) గౌతమ్‌ సవాంగ్‌ (gautam sawang) అమరావతి పరిరక్షణ సమితికి లేఖ రాశారు. దీంతో మహా పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని కోరుతూ రాజధాని రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు (ap high court) రైతుల మహా పాదయాత్రకు అనుమతిచ్చింది. దీనిపై రైతులు హర్షం వ్యక్తం చేశారు.  

ALso Read:అమరావతి రైతులకు ఊరట... హైకోర్టులో జగన్ సర్కార్ కు చుక్కెదురు

కాగా.. పాదయాత్రలో అన్ని వర్గాలనూ కలుపుకొని వెళతామని, ఇప్పటికే అన్ని పార్టీల నేతలను కలిసి ఆహ్వాన పత్రాలు అందిస్తున్నట్లు రైతులు తెలిపారు. అమరావతి రైతుల మహాపాదయాత్రకు ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో పాటు, జనసేన, సీపీఐ, సీపీఎం మద్దతును తెలిపాయి. కొన్ని కారణాలతో ఉద్యమానికి దూరంగా ఉన్న దళిత జేఏసీ నేతలు కూడా.. మహాపాదయాత్రలో పాల్గొంటామని ప్రకటించారు.

కోర్టు తీర్పు నేపథ్యంలో నవంబరు 1న తొలిరోజు తుళ్లూరు నుంచి తాడికొండ వరకు పాదయాత్ర సాగనుంది. అక్కడి నుంచి తాడికొండ, గుంటూరు అమరావతి రోడ్డు, పుల్లడిగుంట, ఏటుకూరు, ప్రత్తిపాడు, పెదనందిపాడు, ఒంగోలు, టంగుటూరు, సింగరాయకొండ, కావలి, నెల్లూరు, కోవూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట, తిరుపతి, అలిపిరి మార్గం గుండా తిరుమలకు యాత్ర చేరుకుంటుంది. తమ పాదయాత్రకు అందరూ మద్దతు తెలిపి విజయవంతం చేయాలని రైతులు కోరుతున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios