గంటా శ్రీనివాసరావుతో పీసీసీ చీఫ్ శైలజనాథ్ భేటీ: ఏం జరుగుతోంది ?
మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో పీసీసీ చీఫ్, మాజీ మంత్రి శైలజనాథ్ గురువారం నాడు విశాఖపట్టణంలో భేటీ అయ్యారు.
విశాఖపట్టణం: మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో పీసీసీ చీఫ్, మాజీ మంత్రి శైలజనాథ్ గురువారం నాడు విశాఖపట్టణంలో భేటీ అయ్యారు.విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామాను సమర్పించారు. ఈ రాజీనామా లేఖ ఇటీవలనే స్పీకర్ సెక్రటరీ కార్యాలయానికి చేరుకొంది.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు సాగుతున్నాయి. వైసీపీతో పాటు విపక్షాలు కూడ నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తున్నాయి.ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో గంటా శ్రీనివాసరావు, శైలజనాథ్ లు మంత్రులుగా పనిచేశారు. 2014 ఎన్నికలకు ముందు గంటా శ్రీనివాసరావు టీడీపీలో చేరారు.
also read:ఉప ఎన్నికల్లో పోటీ చేయను: తేల్చేసిన గంటా శ్రీనివాసరావు
శైలజనాథ్ టీడీపీలో చేరడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేశారని అప్పట్లో ప్రచారం సాగింది. అయితే చివరకు సాధ్యం కాకపోవడంతో ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు.కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ గా ఆయన కొనసాగుతున్నారు. శైలజనాథ్ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను నిరసిస్తూ సాగే ఉద్యమంతో పాటు తాజా రాజకీయాలపై వీరిద్దరి మధ్య చర్చ సాగినట్టుగా సమాచారం.