వైసీపీకి షాక్.. పవన్‌పై జగన్ వ్యాఖ్యలు దారుణం.. పవన్‌కు మద్ధతుగా రఘువీరారెడ్డి

AP PCC Chief Raghuveera reddy supports pawan kalyan
Highlights

పవన్‌కు అండగా నిలిచారు ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి. రాజకీయాల్లో ఉన్న నేతలు వ్యక్తిగత విమర్శలకు దిగడం దారుణమని.. జగన్ అలా అని ఉండాల్సింది కాదని వ్యాఖ్యానించారు.. బీజేపీకి టీడీపీ, వైసీపీ రెండు కళ్లని.. బీజేపీ ఆడిస్తున్న విధంగా టీఆర్ఎస్ ఆడుతోందని మండిపడ్డారు.

కొందరు నేతలు కార్లను మార్చినట్లుగా భార్యలను మారుస్తున్నారంటూ పరోక్షంగా పవన్ కల్యాణ్‌ను ఉద్దేశిస్తూ.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. ఈ వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు పవన్.. జైలు జీవితం, అక్రమ సంపాదన గురించి ప్రస్తావిస్తూ విమర్శలు సంధించారు. ఫ్యాక్షనిస్టులకు భయపడేది లేదని తెగేసి చెప్పాడు.. సీఎంను ఎదుర్కొనే దమ్ములేక.. శక్తిలేక పారిపోతున్నారని.. నా జీవితం తెరిచిన పుస్తకమని.. నేను వ్యక్తిగతంగా వెళితే మీరు ఊపిరి పీల్చుకోలేరని జగన్‌కు ధీటుగానే బదులిచ్చారు

జనసేనాని. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదిక వైసీపీ, జనసేన కార్యకర్తల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో పవన్‌కు అండగా నిలిచారు ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి. రాజకీయాల్లో ఉన్న నేతలు వ్యక్తిగత విమర్శలకు దిగడం దారుణమని.. జగన్ అలా అని ఉండాల్సింది కాదని వ్యాఖ్యానించారు.. బీజేపీకి టీడీపీ, వైసీపీ రెండు కళ్లని.. బీజేపీ ఆడిస్తున్న విధంగా టీఆర్ఎస్ ఆడుతోందని మండిపడ్డారు.

కమలనాథుల డ్రామాలో భాగంగానే ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తే.. తెలంగాణకు కూడా ఇవ్వాలని ఆ పార్టీ పట్టుబడుతోందని ఆరోపించారు.. కాంగ్రెస్, టీడీపీలు పొత్తు పెట్టుకుంటాయనే వార్తల్లో నిజం లేదన్నారు. ఇటీవల ముగిసిన సీడబ్ల్యూసీ సమావేశంలో తాము అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని కాంగ్రెస్ తీర్మానం చేసిందని.. ఇది సంతోషకరమని చెప్పారు.

loader